Venkatesh: హిట్ కొట్టినా మగాళ్లను పిలవడం లేదు: వెంకటేశ్ కామెంట్లు.. స్టేజ్‍పై జోష్‍తో డ్యాన్స్ చేసిన హీరో: వీడియో-veknatesh comments on ishwarya rajesh and meenakshi at sankranthiki vasthunam event and he dances on stage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: హిట్ కొట్టినా మగాళ్లను పిలవడం లేదు: వెంకటేశ్ కామెంట్లు.. స్టేజ్‍పై జోష్‍తో డ్యాన్స్ చేసిన హీరో: వీడియో

Venkatesh: హిట్ కొట్టినా మగాళ్లను పిలవడం లేదు: వెంకటేశ్ కామెంట్లు.. స్టేజ్‍పై జోష్‍తో డ్యాన్స్ చేసిన హీరో: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 27, 2025 08:12 AM IST

Venkatesh - Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. తన మార్క్ సరదా స్పీచ్‍తో హీరో వెంకటేశ్ ఆకట్టుకున్నారు. స్టేజ్‍పై హుషారుగా పాట పాడుతూ డ్యాన్స్ చేశారు.

Venkatesh: హిట్ కొట్టినా మగాళ్లను పిలవడం లేదు: వెంకటేశ్ కామెంట్లు.. స్టేజ్‍పై జోష్‍తో డ్యాన్స్ చేసిన హీరో: వీడియో
Venkatesh: హిట్ కొట్టినా మగాళ్లను పిలవడం లేదు: వెంకటేశ్ కామెంట్లు.. స్టేజ్‍పై జోష్‍తో డ్యాన్స్ చేసిన హీరో: వీడియో

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి భారీ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. సంక్రాంతి రేసులో జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఆశ్చర్యపరిచే కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే రూ.260 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఆ రేంజ్‍లో ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ తరుణంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ ఈవెంట్ భీమవరంలో గ్రాండ్‍గా జరిగింది. బ్లాక్‍బస్టర్ సంబరం పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. వెంకటేశ్ స్పీచ్ అదరగొట్టేశారు.

yearly horoscope entry point

మమ్మల్ని పిలవడం లేదు

సక్సెస్ ఈవెంట్‍లో ఫుల్ ఎనర్జీతో అదరగొట్టారు వెంకటేశ్. సరదాగా స్పీచ్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇంత బ్లాక్‍బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. తన స్పీచ్‍లో హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి గురించి సరదా కామెంట్లు చేశారు వెంకటేశ్. ఈ సినిమాతో వారికి మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా సంతోషంగా అని చెప్పారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‍ల్లో ఎక్కువగా కనిపిస్తున్నారని అన్నారు.

హిట్ కొట్టినా మగాళ్లను ఎవరూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‍లకు ఎవరూ పిలవడం లేదని, ఆడవాళ్లనే పిలుస్తున్నారని సరదాగా కామెంట్లు చేశారు వెంకటేశ్. “ఈ సక్సెస్ తర్వాత వారికి ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అలాగే మంచి చాలా షాప్ ఓపెనింగ్‍లు చేయాలి. ఈ మధ్య వీళ్లు అక్కడే ఉంటున్నారు. అన్నీ ఓపెనింగ్‍లకు ఆడవాళ్లనే పిలుస్తున్నారు. మాకు హిట్లు వచ్చినా మగాళ్లను పిలవడం లేదు. మొత్తం వాళ్లే” అని వెంకటేశ్ అన్నారు.

ఇతర హీరోల అభిమానులకు..

ఈవెంట్లో ఇతర తెలుగు హీరోల అభిమానులు కూడా ఉన్నారని వెంకటేశ్ అన్నారు. ప్రభాస్, పవన్ కల్యాణ్, బన్నీ, రామ్‍చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ హీరోల అభిమానులు ఈ ఈవెంట్‍కు వచ్చారని వెంకీ మాట్లాడారు. దీంతో కేకలతో మోతెక్కిపోయింది. ప్రభాస్‍తో సినిమా చేయాలని ప్రేక్షకులు అరిచారు. “డార్లింగ్‍తో ఉంటదమ్మా. మన డార్లింగ్ మీ ఊరే కదా. అందరితో అనిల్ తీస్తాడు. అన్నీ బ్లాక్‍బస్టర్ చేస్తాడు” అని వెంకటేశ్ అన్నారు. మళ్లీ సంక్రాంతికి వచ్చి బ్లాక్‍బస్టర్ ఇస్తామని చెప్పారు. ప్రభాస్‍తో సినిమా చేయాలనే విషయంపై అనిల్ కూడా స్పందించారు. ప్రేక్షకులు గట్టిగా అనుకుంటే అవుతుందని అన్నారు.

పాటపాడుతూ డ్యాన్స్ చేసిన వెంకీ

సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ఈవెంట్‍లో చాలా ఉత్సాహంగా ఆకట్టుకున్నారు వెంకీ. బ్లాక్‍బస్టర్ పొంగల్ పాటకు స్టేజ్‍పై స్టెప్స్ వేశారు. పాటపాడుతూ డ్యాన్స్ చేశారు. సినిమాలోనూ ఈ పాటన పాడారు వెంకటేశ్. స్టేజ్‍పై కూడా మైక్ పట్టుకొని ఫుల్ జోష్‍తో స్టెప్స్ వేశారు. ఐశ్వర్య, మీనాక్షి కూడా ఆయనతో కలిసి డ్యాన్స్ చేశారు. ఫుల్ ఎనర్జీ చూపారు వెంకీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్య భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేశ్.. మాజీ ప్రేయసి మీనూ క్యారెక్టర్లో మీనాక్షి చౌదరి నటించారు. ఈ మూవీని దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేయగా.. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం