Veera Simha Reddy Twitter Review: వీర సింహా రెడ్డి బ్లాక్‌బస్టరా.. డిజాస్టరా.. ట్విటర్ రివ్యూ ఇదీ
Veera Simha Reddy Twitter Review: వీర సింహా రెడ్డి బ్లాక్‌బస్టరా.. డిజాస్టరా.. గురువారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ట్విటర్ రివ్యూలు వస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అందరూ ముక్త కంఠంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు.
Veera Simha Reddy Twitter Review: నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా గురువారం (జనవరి 12) రిలీజైంది. తెల్లవారుఝాము నుంచే స్పెషల్ షోలు వేయడంతో అభిమానుల హడావిడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అటు యూఎస్ ప్రీమియర్స్‌తోనూ ఈ మూవీ రివ్యూలు ఉదయం నుంచే ట్విటర్‌లో వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అఖండలాంటి మాస్ సక్సెస్ సాధించిన తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డికి ట్విటర్‌లో ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ అయితే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ట్వీట్లు చేస్తుండగా.. న్యూట్రల్ ప్రేక్షకులు మాత్రం సినిమా యావరేజ్ అని తేల్చేశారు. గురువారం ఉదయం నుంచే ఈ మూవీని థియేటర్లలో చూస్తూ అందులోని ముఖ్యమైన సీన్లను మొబైల్స్‌లో వీడియో తీసి ట్వీట్లు చేస్తున్నారు.
బాలయ్య అభిమానులైతే సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ ఉదయం నుంచే ట్వీట్లు చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య ఎంట్రీ, అతని పవర్‌ఫుల్ డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బావ మనోభావాలు పాట సూపర్ అంటూ రివ్యూల్లో రాస్తున్నారు. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లుగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఓవరాల్‌గా ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే ఎక్కువగా వస్తున్నాయి.
సినిమాలో ఏయే డైలాగ్స్ బాగున్నాయో చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో వచ్చిన బాలకృష్ణ సినిమాల్లో బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఈ సంక్రాంతి మనదే అంటూ మరికొందరు తేల్చేశారు. సినిమాలోని కొన్ని సీన్లు గూస్‌బంప్స్ తెప్పించాయని ఓ యూజర్ ఓ సీన్‌ను షేర్ చేసుకున్నాడు.
సంబంధిత కథనం