Unstoppable With NBK2: అన్‌స్టాపబుల్‌లో వీరసింహారెడ్డి టీమ్.. సంక్రాంతికి వీర లెవల్ సందడి
Unstoppable With NBK2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి టీమ్ సందడి చేసింది. దర్శక, నిర్మాతలతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కూడా పాల్గొన్నారు.
Unstoppable With NBK2: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క హోస్ట్‌గా మరోపక్క హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ లాంటి సక్సెస్ తర్వాత ఆయన నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ అన్‌స్టాపబుల్‌లో సందడి చేశారు. బాహుబలి ఎపిసోడ్‌గా రెండు భాగాలుగా ప్రసారం చేశారు. తాజాగా సంక్రాంతికి ఎపిసోడ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది ఆహా.
"అన్‌స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్‌లో వీరసింహారెడ్డి టీమ్ సందడి చేయనుంది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్‌తో పాటు ఫొటోలను షేర్ చేసింది ఆహా. వీరలెవల్ మాస్ పండగ లోడింగ్" అంటూ ట్వీట్ చేసింది ఆహా.
వీరసింహారెడ్డి టీమ్ అన్‌స్టాపబుల్‌లో అడుగు పెడితే.. వీర లెవల్ మాస్ పండగ లోడింగ్. ఫిక్స్ అయిపోండి, సంక్రాంతి పండగకు రీసౌండ్ రావాల్సిందే అంటూ ఆహా సంస్థ తన ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌తో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని పాల్గొన్నారు. వీరితో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కూడా హాజరయ్యారు.
ఇప్పటికే బాహుబలి ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు, విశ్వక్ సేన్-సిద్ధార్థ్ జొన్నలగడ్డ, శర్వానంద్-అడివి శేష్, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, కే రాఘవేంద్రరావు తదితరులు హాజరై బాలయ్యతో కలిసి సందడి చేశారు. అనంతరం ప్రభాస్, గోపీచంద్ రాకతో షో స్థాయి ఎక్కడికో వెళ్లింది. ఇప్పుడు వీరసింహారెడ్డి టీమ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదే ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో జరిగిన ఎపిసోడ్ వస్తే ఇంక ఏ లెవల్‌లో ఉంటుందో తలచుకుంటే అభిమానులకు గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం పవర్ స్టార్ ఎపిసోడ్ సీజన్2 చివరి ఎపిసోడ్‌గా చెబుతున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోపక్క వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు రానుంది. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం