మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2: ఎంపురాన్’ భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‍లాల్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆ రేంజ్‍లో దుమ్మురేపింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర శూరన్: పార్ట్ 2’ మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. కాగా, ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వేర్వేరు ఓటీటీలోకి రానున్నాయి. స్ట్రీమింగ్‍లో పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. ఈ వారమే ఈ రెండు చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి.
భారీ అంచనాలతో వచ్చిన మలయాళ మూవీ ‘ఎల్2: ఎంపురాన్’ అదే రేంజ్‍లో హిట్ అయింది. మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించటంతో కీలకపాత్ర పోషించారు. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‍గా భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. రూ.250కోట్లకు పైగా కలెక్షనను రాబట్టింది. దీంతో మలయాళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా నిలిచింది.
ఇంత హిట్ అయిన ఎల్2: ఎంపురాన్ థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ గురువారం (ఏప్రిల్ 24) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ చిత్రం ఓటీటీలోనూ భారీ వ్యూస్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఎల్2: ఎంపురాన్ మూవీలో మోహన్‍లాల్, పృథ్విరాజ్‍తో పాటు అభిమన్యు సింగ్, మంజు వారియర్, టొవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీపై వివాదాలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అయింది. ఏప్రిల్ 24 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని చూడొచ్చు.
వీర ధీర శూరన్: పార్ట్ 2 చిత్రం కూడా మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీకి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విక్రమ్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సులు, అరుణ్ కుమార్ టేకింగ్ ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాకు టాక్ బాగా వచ్చింది. అయితే, ఆ రేంజ్‍లో కలెక్షన్లు దక్కలేదు. సుమారు రూ.60కోట్ల కలెక్షన్లతో మోస్తరు హిట్ అయింది.
వీర ధీర శూరన్ తొలి భాగంగా కంటే పార్ట్ 2 ముందుగా వచ్చింది. ఈ చిత్రానికి థియేట్రికల్ రన్‍లో మంచి రెస్పాన్స్ రావటంతో ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించే అవకాశం ఉంది. ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ మూవీ ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టనుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఇలా.. జియో హాట్‍స్టార్ ఓటీటీలో ఎల్2 ఎంపురాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీర ధీర శూరన్ ఒకే రోజు ఏప్రిల్ 24న అడుగుపెట్టనున్నాయి. స్ట్రీమింగ్ తర్వాత ఏ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం