Matka Trailer: వ్య‌స‌నంలోనే ప‌త‌నం ఉంటుంది - వరుణ్ తేజ్ మ‌ట్కా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్‌-varun tej matka trailer unveiled by megastar chiranjeevi meenakshi chaudhary nora fathehi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Matka Trailer: వ్య‌స‌నంలోనే ప‌త‌నం ఉంటుంది - వరుణ్ తేజ్ మ‌ట్కా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్‌

Matka Trailer: వ్య‌స‌నంలోనే ప‌త‌నం ఉంటుంది - వరుణ్ తేజ్ మ‌ట్కా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 02, 2024 12:43 PM IST

Matka Trailer: వ‌రుణ్ తేజ్ మ‌ట్కా మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశాడు. ఈ ట్రైల‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ అవతార్‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపిస్తోన్నాడు. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటోన్నాయి. మ‌ట్కా మూవీ న‌వంబ‌ర్ 14న రిలీజ్ అవుతోంది.

మట్కా ట్రైలర్
మట్కా ట్రైలర్

Matka Trailer: వ‌రుణ్ తేజ్ మ‌ట్కా ట్రైల‌ర్‌ను మెగా స్టార్ చిరంజీవి శ‌నివారం రిలీజ్ చేశారు. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ ట్రైల‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ అవ‌తార్‌లో డిఫ‌రెంట్ లుక్‌, మ్యాన‌రిజ‌మ్స్‌తో వ‌రుణ్ తేజ్ క‌నిపించాడు.

యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్‌...

స‌ర్క‌స్‌లో బ‌ఫూన్ల‌ను చూసి జ‌నం అంత న‌వ్వుతారు...చ‌ప్ప‌ట్లు కొడ‌తారు. కానీ ఒక చిన్న‌క‌ర్ర ప‌ట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒక‌డుంటాడు. అలాంటోడే వీడు రింగ్ మాస్ట‌ర్ అనే డైలాగ్‌తోనే ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఈ డైలాగ్ ముగియ‌గానే మూడు డిఫ‌రెంట్ లుక్స్‌లో మాస్ గెట‌ప్‌లో ట్రైల‌ర్‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటుంది. కంప్లీట్ యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్‌ను క‌ట్ చేశారు.

డైలాగ్స్ హైలైట్‌...

నీ అవ‌స‌రం ఈ డ‌బ్బు...వ్య‌స‌న‌మైపోయింది...వ్య‌స‌నంలోనే ప‌త‌నం ఉంటుంది, మ‌నం ఆశ‌ను అమ్ముతాం...న‌మ్మ‌కాన్ని కొంటాం...వేలు తీసుకొని వ‌దిలేయ‌డానికి నేను ద్రోణాచార్యుడిని కాదు...వాసును...మ‌ట్కా కింగ్‌ను, నీలాంటి మంచోడి వ‌ల్ల టైమ్‌కు వ‌ర్షాలు ప‌డుతున్నాయి. పంట‌లు ప‌డుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోడి వ‌ల్ల ప‌ది మంది క‌డుపులు నిండుతున్నాయి నేచ‌ర్ బ్యాలెన్స్ అంటూ మ‌ట్కా ట్రైల‌ర్‌లోని ఆక‌ట్టుకున్నాయి.

క‌ట్లిప్పి సూడు ఇక్క‌డి నుంచి ప్రాణాల‌తో ఒక్క‌డు వెళ‌తాడేమో చూద్దాం..ప్రామిస్ అనే డైలాగ్ వ‌రుణ్ తేజ్‌లోని హీరోయిజాన్ని చాటిచెబుతోంది. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌ట్కాలో కంప్లీట్ నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌ట్కా కింగ్‌...

మ‌ట్కా మూవీకి ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాధార‌ణ యువ‌కుడు మ‌ట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడు? 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల జ‌ర్నీలో అత‌డు ఎదుర్కొన్న అడ్డంకుల‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌ట్కా మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో వ‌రుణ్ తేజ్ క్యారెక్ట‌ర్ రెట్రో లుక్‌లో మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇద్ద‌రు హీరోయిన్లు..

మ‌ట్కా మూవీలో మీనాక్షి చౌద‌రి, నోరా ఫ‌తేహీ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. న‌వీన్ చంద్ర, స‌లోనీ, కాంతార కిషోర్‌ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. మ‌ట్కా మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. న‌వంబ‌ర్ 14న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. గ‌త కొన్నాళ్లుగా వ‌రుణ్‌తేజ్‌కు స‌రైన హిట్స్ లేవు. మ‌ట్కా అత‌డి కెరీర్‌కు కీల‌కంగా మారింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మ‌ట్కా మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.

మూడు సినిమాలు

న‌వంబ‌ర్ 14న మ‌ట్కాతో పాటు సూర్య కంగువ‌, కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీటితో పాటు మ‌హేష్ బాబు మేన‌ల్లుడు హీరోగా న‌టించిన దేవ‌కి నంద‌న వాసుదేవ మూవీ కూడా అదే విడుద‌ల అవుతోంది.

Whats_app_banner