Varun Tej - Lavanya Wedding: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి-varun tej lavanya tripathi wedding celebrations photos goes viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej - Lavanya Wedding: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

Varun Tej - Lavanya Wedding: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 01, 2023 10:22 PM IST

Varun Tej - Lavanya Tripathi Wedding: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో గ్రాండ్‍గా జరిగింది. అత్యంత వైభవంగా వీరి పెళ్లి సంబరాలు సాగుతున్నాయి.

Varun Tej - Lavanya Tripathi Wedding: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
Varun Tej - Lavanya Tripathi Wedding: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

Varun Tej - Lavanya Tripathi Wedding: టాలీవుడ్ హీరో కొణిదెల వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో నేడు (నవంబర్ 1) వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టస్కానీలోని ఓ లగ్జరీ ప్యాలెస్‍లో కొణిదెల, అల్లు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వరుణ్, లావణ్య వివాహం గ్రాండ్‍గా జరిగింది.

మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకకు ధరించారు వరుణ్ తేజ్. ఎరుపు రంగు కాంచీపురం చీరను లావణ్య ధరించారు. వివాహ మండపం వద్దకు వరుణ్ తేజ్ గ్రాండ్‍గా ఓ వింటేజ్ కన్వర్టబుల్ కారులో వచ్చారు. వరుణ్ - లావణ్య వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తున్నాయి. 

టస్కానీలో వరుణ్, లావణ్య వివాహ వేడుకకు మెగా కొణిదెల, అల్లు కుటుంబాల సభ్యులందరూ దాదాపు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ సహా మెగా, అల్లు హీరోలందరూ ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. యంగ్ హీరో నితిన్ కూడా సతీసమేతంగా ఈ వివాహానికి వెళ్లారు.

వరుణ్ తేజ్, లావణ్య వివాహ వేడుకలు టస్కానీలోని ప్యాలెస్‍లో రెండు రోజుల క్రితమే మొదలయ్యాయి. అక్టోబర్ 30న కాక్ టైల్ పార్టీతో ఈ పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. నేడు (నవంబర్ 1) లావణ్య మెడలో తాళి కట్టారు వరుణ్.

నవంబర్ 5వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‍లో వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందిన చాలా మంది అతిథులు హాజరుకానున్నారు.

ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నేడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతంలో వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ సినిమా సమయంలో వీరి ప్రేమ మొదలైంది.

IPL_Entry_Point