Varun Tej - Lavanya Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
Varun Tej - Lavanya Engagement: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‍మెంట్ వేడుక ఘనంగా జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబాలు ఈ వేడుకకు హాజరయ్యాయి.
Varun Tej - Lavanya Tripathi Engagement: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి జరిగింది. హైదరాబాద్‍లోని కొణిదెల నాగబాబు ఇంట్లో ఈ ఎంగేజ్‍మెంట్ ఘనంగా సాగింది. కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబం సమక్షంలో ఈ వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ సహా మెగా, అల్లు హీరోలు.. వరుణ్ - లావణ్య నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. చాలా పరిమిత సంఖ్యలోనే అతిథులు ఈ వేడుకలో పాల్గొన్నట్టు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని సుమారు ఐదేళ్లుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఈ విషయంపై వరుణ్, లావణ్య ఎప్పుడూ స్పందించలేదు. ఆ కుటుంబాలకు చెందిన వారు కూడా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు వారి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి బంధంతో వారు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కలిసి నటించారు. 2017లో మిస్టర్ మూవీ చిత్రీకరణ సమయంలోనే ఆ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత అంతరిక్షం చిత్రం సమయంలో వీరి బంధం మరింత బలపడిందని అప్పట్లో గుసగుసలు బయటికి వచ్చాయి. వరుణ్, లావణ్య ప్రేమలో మునిగి తేలుతున్నారని రూమర్లు వచ్చాయి. అదే నిజమైంది. కాగా, వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరుగుతుందని సమాచారం.
సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున చిత్రం చేస్తున్నాడు. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 25వ తేదీ ఈ మూవీ విడుదల కానుంది. పక్కా యాక్షన్ మూవీగా ఇది రూపొందుతోంది. చేతిలో గన్‍తో సూట్ వేసుకున్న తేజ్ లుక్.. గాండీవధారి అర్జునలో అదిరిపోయింది. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడితోనూ తదుపరి మూవీ చేస్తాడని టాక్. లావణ్య త్రిపాఠి.. తమిళంలో ప్రస్తుతం ఓ చిత్రం చేస్తోంది.