Gandeevadhari Arjuna OTT Release Date: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Gandeevadhari Arjuna OTT Release Date: వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
Gandeevadhari Arjuna OTT Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మూవీ గాండీవధారి అర్జున. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. బుధవారం (సెప్టెంబర్ 20) ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మిగతా భాషల గురించి ఈ ఓటీటీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సినిమాలో సాక్షి వైద్య ఫిమేల్ లీడ్ గా నటించగా.. నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం, రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
గాండీవధారి అర్జున ఎలా ఉందంటే?
స్పై యాక్షన్ కథకు అంతర్లీనంగా గ్లోబల్ వార్మింగ్, మెడికల్ వేస్టేజీ పాయింట్‌ను టచ్ చేస్తూ గాండీవధారి అర్జున కథను రాసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ రొటీన్ పాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో హాలీవుడ్ టచ్ ఇస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నాడు.
లండన్ బ్యాక్‌డ్రాప్, గూఢచారి క్యారెక్టర్‌కు తగ్గ కటౌట్ ఉన్న హీరో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, అందమైన హీరోయిన్ ఉన్నా.. బలమైన ఎమోషన్ ఎక్కడ సినిమాలో కనిపించదు. కమర్షియల్ హంగుల మధ్య కథ మరి గడ్డిపోచ అంత పలుచన అయిపోయింది. ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్‌కు సీక్వెల్‌గా గాండీవధారి అర్జున మారిపోయింది.
అర్జున్ అనే ఏజెంట్ పాత్రకు వరుణ్‌తేజ్ పర్‌ఫెక్ట్ యాప్ట్‌గా నిలిచాడు. అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఏజెంట్‌తో పోలిస్తే సాక్షి వైద్యకు మంచి పాత్ర దక్కింది. ఐరా క్యారెక్టర్‌లో ఆమె యాక్టింగ్‌కు మంచి మార్కులే పడతాయి. విలన్ పాత్రలో వినయ్‌రాయ్ స్టైలిష్‌గా కనిపించాడు. కానీ అతడి క్యారెక్టర్ డిజైనింగ్, యాక్టింగ్‌లో కొత్తదనం కనిపించలేదు. నాజర్‌తో పాటు అభినవ్ గోమటం, విమలా రామన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు.