Varun Tej Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా గాండీవధారి అర్జున-varun tej gandeevadhari arjuna is the most expensive film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Varun Tej Gandeevadhari Arjuna Is The Most Expensive Film

Varun Tej Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా గాండీవధారి అర్జున

Maragani Govardhan HT Telugu
Feb 10, 2023 12:12 PM IST

Varun Tej Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అతడు నటించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

వరుణ్ తేజ్
వరుణ్ తేజ్

Varun Gandeevadhari Arjuna: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ గతేడాది గని లాంటి పరాజయాన్ని చవిచూడగా.. ఎఫ్3 లాంటి సూపర్ సక్సెస్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఆ సినిమానే గాండీవధారి అర్జున. పీఎస్వీ గరుడవేగ లాంటి సూపర్ హిట్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తారు.. వరుణ్ తేజ్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలను తీవ్రంగా పెంచేశారు.

గతేడాది అక్టోబరులో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీ కరణ ప్రస్తుతం విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంగ్లాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తిచేసుకుంది ఈ సినిమా. అనంతరం విదేశీ సాంకేతిక నిపుణుల సాయంతో భారీ యాక్షన్ సన్నివేశాల రూపొందించి షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి చిత్రబృందం లండన్‌కు షిఫ్టయింది. చిత్రీకరణ కోసం ఇతర ఐరోపా దేశాలకు కూడా వెళ్లనుంది.

హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ రిచ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందించనున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మునుపెన్నడూ చూడని అవతార్‌లో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు.

ఈ ప్రాజెక్టుకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. ముకేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎన్ఎస్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ ప్రమాణాలకు దీటుగా తెరకెక్కించనున్నారు.

IPL_Entry_Point

టాపిక్