Varun Tej: సెల్ ఫోన్స్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒకే నెంబర్‌ను ఒకేరోజు పంపించాడు.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్
Varun Tej About Matka King Ratan Khatri: హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మట్కా సినిమా విశేషాలను పంచుకున్నాడు వరుణ్ తేజ్. అందులో మట్కా కింగ్‌గా పిలవబడే రతన్ ఖత్రి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
Varun Tej On Matka King Ratan Khatri: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా చేశారు. మట్కా మూవీని డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు.
ఇటీవల విడుదలైన మట్కా మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 'మట్కా' మూవీ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
'మట్కా' కథ ఎలా ఉండబోతోంది?
-వాసు అనే అబ్బాయి కథే మట్కా. తను బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాం. వాసు అనే అబ్బాయి లైఫ్ స్టోరీ ఇది.
మట్కా కింగ్ రతన్ ఖత్రి క్యారెక్టర్‌తో వాసుకి పోలిక ఉందా?
-డైరెక్టర్ గారు ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. రతన్ ఖత్రి ది ముంబై నేపథ్యం. తను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. పైగా ఆయన చేసిన పనులను జనాలు రూమర్స్‌లా మాట్లాడుకోవడమే తప్పితే కొన్నిటికి ఆధారాలు లేవు.
-సెల్ ఫోన్స్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒకే నెంబర్‌ని ఒకే రోజు పంపించడాని చెప్తుంటారు. తను ఎలా పంపించాడో ఎవరికీ తెలియదు. మా డైరెక్టర్ గారు ఒకవేళ తనే మట్కా కింగ్ అయి ఉంటే తను ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్‌తో వాసు క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు.
వాసు క్యారెక్టర్ కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు?
-మేజర్ హోంవర్క్ అంటే డైరెక్టర్ గారితో చాలా టైం స్పెండ్ చేశాను. చాలాసార్లు స్క్రిప్ట్ చదివాను. క్యారెక్టర్‌లోకి తీసుకురావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. చదువుతున్నప్పుడే వాసు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక అంచనాకొస్తాం. దానితో ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. తను ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? ఎలా సిగరెట్ కాలుస్తాడు? ఇవన్నీ చదువుతున్నప్పుడే ఐడియా వచ్చేస్తుంది.
-ఇక ఉత్తరాంధ్ర యాస విషయానికి వస్తే వాసు బర్మా నుంచి వస్తాడు కాబట్టి తను ఆ యాస మాట్లాడాల్సిన అవసరం బిగినింగ్‌లోనే ఉండదు. ఆ క్యారెక్టర్ జర్నీ జరుగుతున్న కొద్దీ అక్కడ యాస పడుతుంది. తన ఏజ్ పెరిగిన కొద్దీ తన క్యారెక్టర్‌తో పాటు బ్యాడీ లాంగ్వేజ్, యాస పాలిష్ అవుతుంది.
-మట్కా ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. షూటింగ్ లొకేషన్లో అవతలి యాక్టర్‌తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కూడా హెల్ప్ అయ్యింది. సినిమా కోసం స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా చేశాం.