Varuntej Gandeevadhari Arjuna: గాండీవధారి అర్జునగా వరుణ్‌తేజ్ - ప్రవీణ్ సత్తారు సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్
Varuntej Gandeevadhari Arjuna: మెగా హీరో వరుణ్‌తేజ్ 12వ సినిమాకు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఏదంటే...
Varuntej Gandeevadhari Arjuna: వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు డిఫరెంట్‌టైటిల్ ఫిక్సయింది. యాక్షన్ ఎంట్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు గాండీవధారి అర్జున అనే పేరును ఖరారు చేశారు. గురువారం వరుణ్‌తేజ్ పుట్టినరోజును పురస్కరించుకొని టైటిల్‌ను అనౌన్స్‌చేశారు.
ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ క్లాక్ టవర్‌తో పాటు పురాతన కోట కనిపిస్తోంది. గన్స్, కత్తులు, బాంబులను చూపించారు. విలన్స్‌తో ఫైట్ చేస్తూ వరుణ్‌తేజ్ మోషన్ పోస్టర్‌లో కనిపించారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గాండీవధారి అర్జున సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం. ఇందులో జగపతిబాబు కీలక పాత్రను పోషించనున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో మినిస్టర్‌ను కాపాడటానికి ప్రయత్నించే ఓ అండర్ కవర్ కాప్‌గా వరుణ్‌తేజ్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న 12వ సినిమా ఇది. గాండీవధారి అర్జున సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
మరోవైపు ది ఘోస్ట్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. కాగా వరుణ్‌తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జునతో పాటు ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తోన్నాడు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న సినిమాతో వరుణ్‌తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.