Apsara Rani: విల‌న్‌గా వ‌రుణ్ సందేశ్ - క్రాక్ బ్యూటీ అప్స‌ర‌రాణి రాచ‌రికం ట్రైల‌ర్ రిలీజ్‌-varun sandesh to play baddie in apsara rani racharikam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Apsara Rani: విల‌న్‌గా వ‌రుణ్ సందేశ్ - క్రాక్ బ్యూటీ అప్స‌ర‌రాణి రాచ‌రికం ట్రైల‌ర్ రిలీజ్‌

Apsara Rani: విల‌న్‌గా వ‌రుణ్ సందేశ్ - క్రాక్ బ్యూటీ అప్స‌ర‌రాణి రాచ‌రికం ట్రైల‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2025 03:52 PM IST

Apsara Rani: హ్యాపీడేస్ హీరో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. రాచ‌రిక మూవీలో నెగెటివ్ క్యారెక్ట‌ర్ చేశాడు. అప్స‌ర‌ రాణి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ కాబోతోంది. రాచ‌రికం మూవీ ట్రైల‌ర్‌ను డైరెక్ట‌ర్ మారుతి రిలీజ్ చేశాడు.

అప్స‌ర‌ రాణి
అప్స‌ర‌ రాణి

Apsara Rani: వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. రాచ‌రికం సినిమాలో నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ చేస్తోన్నాడు. అప్స‌ర‌ రాణి హీరోయిన్‌గా న‌టించిన రాచ‌రికం మూవీ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల డైరెక్ట‌ర్ మారుతి రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వం వహించారు. విజ‌య్ శంక‌ర్ హీరోగా న‌టిస్తోన్నాడు.

yearly horoscope entry point

రివేంజ్ డ్రామాగా...

రాచ‌రికం ట్రైల‌ర్‌లో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ క్యారెక్ట‌ర్స్‌, డిఫరెంట్ లుక్స్, నటించిన విధానం చాలా కొత్తగా ఉంది. విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే క‌నిపిస్తోంది.

రాచ‌కొండ ఊరిలో...

రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌, బీజీఎం ఆస‌క్త‌ని పంచుతోన్నాయి.

ప‌గ‌, ప్ర‌తీకారాలు...

రాయ‌ల‌సీమ ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో పాటు అంత‌ర్లీనంగా రాచ‌రికం మూవీలో ఓ బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. గ‌తంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన అప్స‌ర‌రాణి ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. విల‌న్‌గా వ‌రుణ్ సందేశ్ కొత్త కోణంలో ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నాడు.

ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్‌...

ఈ సినిమాకు వెంగీ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఫిబ్రవరి 1న రాచ‌రికం మూవీ విడుద అవుతోంది. ఈ సినిమాలో హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈశ్వ‌ర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నాడు.

స్పెష‌ల్ సాంగ్స్‌...

ఫోర్ లెటర్స్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్స‌ర‌రాణి. రామ్‌గోపాల్ వ‌ర్మ డేంజ‌ర‌స్‌లో హీరోయిన్‌గా న‌టించింది. క్రాక్‌, సీటీమార్‌, హంట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది.

కానిస్టేబుల్‌...

మ‌రోవైపు వ‌రుణ్ సందేశ్ ప్ర‌స్తుతం తెలుగులో కానిస్టేబుల్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోన్నాడు. గ‌త ఏడాది అత‌డు హీరోగా న‌టించిన నింద మూవీ డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

Whats_app_banner