Viraaji OTT Streaming: మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ట్విస్టులతో సాగే చిత్రం!
Viraaji OTT Streaming: విరాజి సినిమా మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉన్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన విరాజి చిత్రం గతేడాది ఆగస్టు 2న థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్ తర్వాత ఈ సైకలాజికల్ మూవీపై క్యూరియాసిటీ పెరిగింది. అయితే, అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఇప్పుడు రెండో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ ఎక్కడ..
విరాజి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు (ఫిబ్రవరి 18) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కానీ, రూ.99 రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం గతేడాది ఆగస్టు 22వ తేదీనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో ఎంట్రీ ఇచ్చింది. ఆహాలో రెంట్ లేకుండా ఆ ప్లాట్‍ఫామ్ సబ్‍స్క్రైబర్లు చూడొచ్చు.
విరాజి చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. ఓ మెంటల్ ఆసుపత్రికి చెందిన పాడుబడిన భవనంలో కొందరు చిక్కుకోవడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ట్విస్టులతో ఈ మూవీని నడిపించారు దర్శకుడు. అయితే అనుకున్న స్థాయిలో ఇది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
డిఫరెంట్ గెటప్.. అయినా..
విరాజి సినిమాలో వరుణ్ సందేశ్ డిఫరెంట్ గెటప్‍లో కనిపించారు. ఈ చిత్రంపై రిలీజ్‍కు ముందు బజ్ వచ్చింది. అయితే ఫలితం మాత్రం ఊహించిన విధంగా రాలేదు. కొన్నేళ్లుగా హిట్ లేకుండా ఉన్న వరుణ్‍కు మరో ప్లాఫ్ ఎదురైంది. విరాజి తన కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని ప్రమోషన్లలో వరుణ్ బలంగా చెప్పారు. కానీ అలా జరగలేదు.
విరాజి చిత్రంలో వరుణ్ సందేశ్‍తో పాటు ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించగా.. ఎబెనేజర్ పౌల్ దర్శకత్వం వహించారు. జీవీ అజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.
విరాజి స్టోరీలైన్ ఇదే
ఆండీ (వరుణ్ సందేశ్), సుధ (ప్రమోదిని), ప్రభాకర్ (జయరాం) సహా కొందరిని కొండపై ఉన్న ఓ భవనానికి గుర్తు తెలియని వ్యక్తి పిలుస్తాడు. ఒకప్పుడు మెంటల్ ఆసుపత్రిగా ఉన్న ఆ భవనం పాడైపోయి ఉంటుంది. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. అక్కడికి వారిని పిలిచిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు.. ఎందుకు పిలిచాడు.. ఎందుకు చంపాలనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందనే విషయాలు విరాజి చిత్రం ప్రధానంగా ఉంటాయి. ఈ చిత్రంలో ట్విస్టులు మెప్పించినా.. స్క్రీన్‍ప్లే అంత ఎంగేజింగ్‍గా సాగదనే అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా గజిబిజీగా అనిపిస్తుందనే కామెంట్లు వినిపించాయి. అయితే, థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారిని మెప్పించే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం