Mystery Thriller OTT: లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-varun sandesh latest crime mystery thriller movie ninda ott platform and streaming date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mystery Thriller Ott: లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mystery Thriller OTT: లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Published Jul 23, 2024 10:03 AM IST

Mystery Thriller OTT: వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన నింద మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ
మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ

Mystery Thriller OTT: వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ నింద ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ మూవీ ద్వారా రాజేష్ జ‌గ‌న్నాథ‌మ్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నింద సినిమాను ద‌ర్శ‌కుడే స్వ‌యంగా ప్రొడ్యూస్ చేశాడు. రాజ‌న్న ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ జూన్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్‌లో...

దాదాపు నెలన్న‌ర త‌ర్వాత నింద మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. నింద మూవీ డిజిట‌ల్‌స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్ ఉద్యోగిగా...

నింద మూవీలో గ‌త సినిమాల‌కు భిన్నంగా హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్‌లో ప‌నిచేసే యువ‌కుడిగా వ‌రుణ్ సందేశ్ ఇంటెన్స్ రోల్‌లో క‌నిపించాడు. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు వ‌రుణ్ సందేశ్ యాక్టింగ్‌, క‌థ‌లోని ట్విస్ట్‌లు బాగున్నాయంటూ థియేట‌ర్ల‌లో రిలీజైన టైమ్‌లో కామెంట్స్ వినిపించాయి.

నింద క‌థ ఇదే...

మంజు (క్యూ మ‌ధు) అనే యువ‌తిని రేప్ చేసి చంపేశాడ‌ని కాండ్ర‌కోట‌కు చెందిన బాల‌రాజును (ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌) పోలీసులు అరెస్ట్ చేస్తారు.పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌లో బాల‌రాజు ఈ హ‌త్య చేశాడ‌ని ఆధారాలు దొరుకుతాయి. జ‌డ్జి స‌త్యానంద్ (త‌నికెళ్ల‌భ‌ర‌ణి) అత‌డికి ఉరిశిక్ష విధిస్తాడు. బాల‌రాజు నేరం చేయ‌లేద‌ని స‌త్యానంద్‌ న‌మ్ముతాడు. అత‌డిని ఎలాగైనా నిర్ధోషిగా నిరూపించ‌మ‌ని హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్‌లో ప‌నిచేసే కొడుకును కోరుతాడు.

తండ్రికి ఇచ్చిన మాటను నిల‌బెట్టుకోవ‌డం కోసం బాల‌రాజు కేసును రీ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు వివేక్‌. అత‌డి అన్వేష‌ణ‌లో ఏం తేలింది? నిజంగా బాల‌రాజే హంత‌కుండా?ఈ హ‌త్య‌కు బాల‌రాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? మంజును ప్రేమించిన మ‌నోహ‌ర్ ఎవ‌రు? హంత‌కుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్న‌దే నింద మూవీ క‌థ‌.

నెగెటివ్ షేడ్స్‌లో...

నింద మూవీలో అనీ క్యూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. ఆమె క్యారెక్ట‌ర్‌లో వ‌చ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది.

విరాజి రిలీజ్ డేట్‌

నింద మూవీ త‌ర్వాత విరాజి పేరుతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు వ‌రుణ్ సందేశ్‌. ఈ మూవీలో కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆగ‌స్ట్ 2న విరాజి రిలీజ్ కాబోతోంది. ఆద్యంత్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న కానిస్టేబుల్ తో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

Whats_app_banner