Varun Sandesh: యాక్షన్ హీరోగా మారిన వరుణ్ సందేశ్ - కానిస్టేబుల్ టీజర్ రిలీజ్
Varun Sandesh: వరుణ్ సందేశ్ యాక్షన్ హీరోగా అవతారం ఎత్తాడు. కానిస్టేబుల్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశాడు. కానిస్టేబుల్ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
Varun Sandesh: వరుణ్ సందేశ్ యాక్షన్ హీరోగా మారాడు. క్రైమ్ థ్రిల్లర్ కథతో కానిస్టేబుల్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని బలగం జగదీష్ నిర్మిస్తోన్నారు. కానిస్టేబుల్ మూవీ టీజర్‌ను ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.
సీరియల్ కిల్లర్ కథతో...
టీజర్ చూస్తుంటే ఓ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. ఓ అమ్మాయిని కిల్లర్ అతి దారుణంగా హింసించి చంపడం, ఈ కేసును కానిస్టేబుల్ అయిన వరుణ్ సందేశ్ ఎలా ఛేదించాడన్నది చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో కానిస్టేబుల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో...
ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. నెక్స్ట్ ఏం జరుగబోతుందోననే క్యూరియాసిటీ కలిగిస్తోంది. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్‌గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వరుణ్ సందేశ్‌కు మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాలి" అని అన్నారు.
నాకు ఇష్టమైన సినిమా...
“గతంలో త్రినాథరావు నక్కినతో కలిసి ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమా చేశా. నాకు ఇష్టమైన సినిమాల్లో అది ఒకటి. కానిస్టేబుల్ నా కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలిచిపోతుందనే నమ్మకముంది. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో గాయపడ్డాను. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ సినిమా చేశాం. నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకముంది” అని వరుణ్ సందేశ్ అన్నాడు.హీరో వరుణ్ సందేశ్‌కు మంచి కమ్ బ్యాక్ మూవీగా కానిస్టేబుల్ నిలుస్తుందనే నమ్మకముందని నిర్మాత బలగం జగదీష్ అన్నాడు.
మధులిక వారణాసి...
కానిస్టేబుల్ మూవీలో వరుణ్ సందేశ్‌కు జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. మురళీధర్ గౌడ్, దువ్వాసి మోహన్, రవివర్మ, కల్పలత కీలక పాత్రల్లో నటిస్తోంది. గత ఏడాది రిలీజైన నిందతో ప్రేక్షకులను మెప్పించాడు వరుణ్ సందేశ్. నింద తర్వాత ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తోన్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు.