Action Thriller OTT: ఓటీటీలో ఈ వారమే రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు కీర్తి సురేశ్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ.. ఎప్పుడు చూడొచ్చంటే..
OTT Action: బేబీ జాన్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఇప్పటికే రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఈ వారమే రెంట్ తొలగిపోనుంది. రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‍గా ఉన్న కీర్తి సురేశ్.. బాబీ జాన్ మూవీతో బాలీవుడ్‍లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక పోయింది. బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్‍గా చేశారు కీర్తి సురేశ్. ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో ఓటీటీలో ఉంది. అయితే, ఈ వారం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.
రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పడంటే..
బాబీ జాన్ చిత్రం ఈ గురువారం ఫిబ్రవరి 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ ఫిబ్రవరి 5న రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. రూ.249 రెంట్ చెల్లించి చూసేలా ఉంది. అయితే, ఫిబ్రవరి 20న ఆ రెంట్ తొలగిపోనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లు ఆ మూవీని అద్దె లేకుండా ఫ్రీగా చూసేయవచ్చు.
థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు బాబీ జాన్ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ప్రస్తుతం హిందీలోనే ఉంది. మరి ఇతర డబ్బింగ్ భాషల్లో వస్తుందో లేదో చూడాలి.
తమిళ మూవీ తేరి కథ ఆధారంగా బేబీ జాన్ చిత్రాన్ని డైరెక్టర్ కలీస్ తెరకెక్కించారు. ఈ సినిమాకు రిలీజ్‍కు ముందు మంచి క్రేజే వచ్చింది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు డీలాగా వచ్చాయి. దీంతో బాలీవుడ్ డెబ్యూ మూవీ కీర్తి సురేశ్‍కు నిరాశ మిగిల్చింది.
బేబీ జాన్ కలెక్షన్లు
బేబీ జాన్ సినిమా ఓవరాల్‍గా రూ.60కోట్లలోపు కలెక్షన్లనే దక్కించుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.160కోట్ల బడ్జెట్‍తో రూపొందిందనే అంచనా. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచి నష్టాలను మూటగట్టుకుంది ఈ చిత్రం. కమర్షియల్‍గా ఫెయిల్ అయింది.
బేబీ జాన్ చిత్రంలో వరుణ్, కీర్తితో పాటు వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్, రాజ్‍పాల్ యాదవ్, షీబా చద్దా, జారా జ్యానా, ప్రకాశ్ బెలవాది కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్, సినీ1 స్టూడియోస్, విపిన్ అగ్నిహోత్రీ ఫిల్మ్స్, ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, మురాద్ ఖేతానీ, అట్లీ, ప్రియా అట్లీ నిర్మించారు. ఈ చిత్రానికి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి రూబెన్ ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం