Prabhas Krithi Sanon: ప్రభాస్, కృతిసనన్ ప్రేమను కన్ఫార్మ్ చేసిన బాలీవుడ్ హీరో
Prabhas Kriti Sanon: ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీపై బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..
Prabhas Kriti Sanon ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రభాస్, కృతిసనన్ మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో కృతిసనన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. అవకాశం వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానంటూ కృతిసనన్ చెప్పిన పాత ఇంటర్య్వూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా ప్రభాస్, కృతిసనన్ ప్రేమాయణంపై బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్‌ధావన్, కృతిసనన్ కలిసి నటించిన భేడియా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ధావన్, కృతి సనన్ కలిసి ఝలక్ ధిక్లా జా డ్యాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌లుగా హాజరయ్యారు.
ఇందులో కృతిసనన్ పేరును మరొకరి హృదయం తలచుకుంటోంది, అతడి మనసు మొత్తం కృతి ప్రేమతో నిండిపోయిందని వరుణ్‌ధావన్ (Varun Dhawan) అన్నాడు. ఎవరి హృదయం అంటూ మరో గెస్ట్ కరణ్ జోహార్ …వరుణ్‌ధావన్ మాటలను పొడిగించారు. కరణ్ ప్రశ్నకు... ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబాయిలో లేడు. మరో చోట దీపికా పడుకోణ్‌తో షూటింగ్‌లో ఉన్నాడంటూ వరుణ్ ధావన్ పేర్కొన్నాడు. ఆ హీరో పేరు మాత్రం అతడు వెల్లడించలేదు.
వరుణ్ ధావన్ చెబుతున్న మాటలకు కృతిసనన్ చిరునవ్వులు చిందిస్తూ ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం దీపికా పడుకోణ్‌తో (Deepika Padukone) కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ప్రభాస్‌ను ఉద్దేశించే వరుణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. వరుణ్ ధావన్ మాటలను బట్టి చూస్తే ప్రభాస్ కృతిసనన్ ప్రేమలో ఉన్నది నిజమేనని అంటున్నారు.
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణగాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని భావించారు. టీజర్ రిలీజ్ తర్వాత వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు రావడంతో రిలీజ్ డేట్‌ను వాయిదావేశారు.
ఆదిపురుష్ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్‌సలార్‌తో(Salaar)తో పాటు దర్శకుడు మారుతితో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.