Varisu Vs Thunivu Bookings : విజయ్ దళపతి వర్సెస్ అజిత్.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్
Varisu and Tunivu Movies : ఒకే రోజు రెండు పెద్ద సినిమాల రిలీజ్ అంటే బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దళపతి నటించిన వారిసు, అజిత్ నటించిన తునివు కలిపి మెుదటి వారంలో రూ.100 కోట్లపైనే రావచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వారిసు(Varisu), తునివు(Thunivu) అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగాయి. అజిత్, దళపతి విజయ్ సినిమాలు ఒకే రోజున అంటే జనవరి 11న విడుదల అవుతున్నాయి. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఓ వైపు వారిసు, తునివు బాక్సాఫీస్ వద్ద ఢీ కొంటున్నాయి. ఈ రెండు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం భారీగా జరిగాయి.
అజిత్ కుమార్ నటించిన తునివు చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఈ చిత్రం ఇప్పటికే మంచి డిమాండ్‌ని చూస్తోంది. విజయ్ నటించిన వారిసుతో బాక్సాఫీస్ వద్ద తునివు ఢీ కొంటోంది. రెండు చిత్రాలకు థియేటర్లను అడ్జస్ట్ చేశారు. వారిసు కంటే.. తునివు కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ మంచి బుకింగ్స్ సంపాదించుకోగలిగింది.
ట్రేడ్ నిపుణుల ప్రకారం.. Thunivu మంగళవారం మధ్యాహ్నం నాటికి మొదటి రోజు భారతదేశం అంతటా ముందస్తు బుకింగ్‌లో రూ. 8.8 కోట్లు సంపాదించింది. ఈ సంఖ్య తర్వాత 9 కోట్ల రూపాయలను దాటేసిందని ట్రేడ్ ఇన్‌సైడర్లు చెబుతున్నారు. ట్రేడ్ నిపుణులు ఈ చిత్రం బుధవారం భారతదేశం అంతటా దాదాపు రూ. 30-32 కోట్ల నికర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక దళపతి విజయ్(Thalapathy Vijay) ఈ ఏడాది మొదట్లోనే వారిసుతో వస్తున్నాడు. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు మూడు రోజుల తరువాత విడుదల కానున్నాయి. విజయ్ స్టార్‌డమ్, పండుగకు విడుదల కారణంగా ఈ చిత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. భారీ ఓపెనింగ్స్ కూడా ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు.
ట్రేడ్ నిపుణుల ప్రకారం.. వారిసు మంగళవారం మధ్యాహ్నం నాటికి మొదటి రోజు భారతదేశం అంతటా ముందస్తు బుకింగ్‌లో రూ. 9.6 కోట్లు సంపాదించింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 10 కోట్ల రూపాయలను దాటేసిందని ట్రేడ్ ఇన్‌సైడర్లు చెబుతున్నారు. సినిమా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టేలా ఉంది. ఈ చిత్రం బుధవారం నాడు భారతదేశం అంతటా దాదాపు రూ. 30-35 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్యే. దళపతి విజయ్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి పాపులారిటీ ఉంది.
తమిళనాడు(Tamil Nadu)తోపాటు ఇతర భాషల్లోనూ విజయ్, అజిత్ కు మంచి స్టార్ డమ్ ఉంది. దీంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజు రెండు పెద్ద సినిమాల రిలీజ్ అంటే బిజినెస్ పెద్దగానే జరగనుంది. ఈ రెండు సినిమాల మధ్య తమిళనాడులో పొంగల్ వీకెండ్ రూ.100 కోట్లపైనే బిజినెస్ ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.