Varasudu Release Date: వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాల‌య్య‌ సినిమాల‌ త‌ర్వాతే వార‌సుడు - దిల్‌రాజు-varasudu release date vijay movie hit the screens on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Varasudu Release Date Vijay Movie Hit The Screens On This Date

Varasudu Release Date: వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాల‌య్య‌ సినిమాల‌ త‌ర్వాతే వార‌సుడు - దిల్‌రాజు

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2023 10:46 AM IST

Varasudu Release Date: విజ‌య్ వార‌సుడు సినిమా రిలీజ్ డేట్‌ను సోమ‌వారం నిర్మాత దిల్‌రాజు అనౌన్స్‌చేశారు. త‌మిళంలో రిలీజైన రెండు రోజుల త‌ర్వాత తెలుగులో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

వార‌సుడు
వార‌సుడు

Varasudu Release Date: వార‌సుడు సినిమా రిలీజ్ డేట్‌ను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు నిర్మాత దిల్‌రాజు. జ‌న‌వ‌రి 14న వార‌సుడును ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌తో డిస్క‌స్ చేసిన త‌ర్వాతే సినిమాను ఆల‌స్యంగా విడుద‌ల చేయాల‌నే నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఒక అడుగు వెన‌క్కి వేశాన‌నే బాధ లేద‌ని తెలిపాడు.

త‌మిళంలో వారిసుతో సూప‌ర్ హిట్ కొట్ట‌డం గ్యారెంటీ అని...మంచి సినిమా ఎప్పుడూ రిలీజ్ చేసినా ప్రేక్ష‌కులు చూస్తార‌ని న‌మ్మ‌కంతోనే తెలుగులో జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు దిల్‌రాజు వెల్ల‌డించాడు. టాలీవుడ్‌లో చాలా రోజులుగా థియేట‌ర్ల ఇష్యూ న‌డుస్తోంద‌ని, త‌న‌ను అంద‌రూ టార్గెట్ చేస్తున్నార‌ని దిల్‌రాజు పేర్కొన్నాడు.

జ‌న‌వ‌రి 12 బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి, జ‌న‌వ‌రి 13న చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమాలు వ‌స్తున్నాయి. ముందుగా పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లో ప‌డాలి. వారికి ప్ర‌తి చోట థియేట‌ర్లు దొర‌కాలి. ఆ త‌ర్వాతే నా సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకొని వార‌సుడును వాయిదా వేసిన‌ట్లు దిల్‌రాజు చెప్పాడు.

చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల‌కు వార‌సుడు పోటీ కాద‌ని పేర్కొన్నాడు దిల్‌రాజు. పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొందించామ‌ని దిల్‌రాజు తెలిపాడు. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, శ‌త‌మాంన‌భ‌వ‌తి త‌ర‌హాలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని చెప్పాడు. . సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు ఆడాల‌ని అన్నాడు.

త‌మిళంలో రూపొందిన వారిసు సినిమాను వార‌సుడు పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. వారిసు త‌మిళంలో జ‌న‌వ‌రి 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point