Thriller OTT: తొమ్మిది నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించిన శబరి మూవీ సన్ నెక్స్ట్, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఆమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. సెకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు.

Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంటల్‌తో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సన్ నెక్స్ట్, ఆహా ఓటీటీలలో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మిక్స్డ్ టాక్...
శబరి మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు.
గత ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన శబరి మూవీ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్నది. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్టింగ్ బాగుందనే టాక్ వచ్చిన...కథలో ఆసక్తి లోపించడం, మెయిన్ ట్విస్ట్‌లు సర్ప్రైజింగ్గా లేకపోవడంతో మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
శబరి కథ ఇదే...
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్) ధైర్యవంతురాలైన మహిళ. అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం సంజనకు తెలుస్తుంది. దాంతో కూతురు రియాను (బేబీ నివేక్ష) తీసుకొని భర్తకు దూరంగా (బేబీ నివేక్ష) వైజాగ్ వచ్చేస్తోంది సంజన.
సంజనను వెతుక్కుంటూ సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వైజాగ్వస్తాడు. సంజనను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ఎటాక్ నుంచి తప్పించుకున్న సంజన...సూర్యపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంజన. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తేలుతుంది. సంజననే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తారు.
నిజంగానే సంజనకు మానసిక సమస్య ఉందా? యాక్సిడెంట్లో చనిపోయిన సూర్య ఎలా ప్రాణాలతో తిరిగొచ్చాడు? సంజనను చంపాలని సూర్య ఎందుకు అనుకున్నాడు? సంజన గతం ఏమిటి? కూతురు రియాను తన దగ్గరకు రప్పించేందుకు అరవింద్ ఏం చేశాడు? సూర్య, అరవింద్ కుట్రల బారి నుంచి తన కూతురిని సంజన ఎలా కాపాడుకుంది అన్నదే శబరిమూవీ కథ.
దళపతి విజయ్ మూవీలో...
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె హీరోయిన్గా సంక్రాంతికి రిలీజైన తమిళ మూవీ మధగజరాజా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కిచ్చా సుదీప్ మ్యాక్స్‌లో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్లో కనిపించింది. ప్రస్తుతం దళపతి విజయ్ జన నాయగన్లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
సంబంధిత కథనం