Varalaxmi Sarathkumar: తమిళ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ తెలుగులోనూ చాలా పాపులర్ అయ్యారు. క్రాక్ సినిమా తర్వాత వరుసగా తెలుగులో చిత్రాలు చేస్తున్నారు. క్రాక్ చిత్రంలో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్ర చాలా పాపులర్ అయింది. మూడేళ్లుగా తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. కాగా, వరలక్ష్మి శరత్‍కుమార్ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాదే తన పెళ్లి ఉంటుందని కూడా ఆమె చెప్పారు. అయితే, వరలక్ష్మి ఏ దేశంలో పెళ్లి చేసుకోనున్నారో తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. డేట్ విషయంలోనూ రూమర్లు వచ్చాయి.
నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం ఈ ఏడాది మార్చి 1వ తేదీన ముంబైలో జరిగింది. వీరి వివాహం జూలై 2వ తేదీన జరుగుతుందంటూ తాజాగా కొన్ని రిపోర్టులు బయటికి వచ్చాయి. థాయ్‍లాండ్‍లో గ్రాండ్‍గా వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నారే సమాచారం చక్కర్లు కొడుతోంది.
పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమానికి చెన్నైలోనే జరుపుకోవాలని వరలక్ష్మి నిర్ణయించుకున్నారట. అయితే, పెళ్లి మాత్రం థాయ్‍లాండ్‍లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే వివాహం కోసం థాయ్‍లాండ్‍లో ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
థాయ్‍లాండ్‍లో జరగనున్న పెళ్లి భారీ స్థాయిలో సినీ సెలెబ్రిటీలను ఆహ్వానం అందనుందని, అత్యంత ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత రిసెప్షన్‍ను చెన్నైలో నిర్వహించాలని వరలక్ష్మి ప్లాన్ చేసుకున్నారట.
గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ సుమారు 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది మార్చిలో ముంబైలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫొటోలను వరలక్ష్మి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్ట్ చేశారు.
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి సినిమా ఈ ఏడాది మే 3వ తేదీన రిలీజ్ అయింది. ఈ ఎమోషనల్ యాక్షన్ మూవీకి అనిల్ కట్జ్ దర్శకత్వం వహించారు. ఎమోషనల్ నటనతోనే వరలక్ష్మి మెప్పించారు. ఈ మూవీ కమర్షియల్‍గా అంత సక్సెస్ కాలేకపోయింది. కానీ వరలక్ష్మి నటనకు ప్రశంసలు దక్కాయి.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తక్కువ కాలంలోనే సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. నెగెటివ్ పాత్రల్లో ఎక్కువగా చేసి తన మార్క్ చూపారు. 2012లో పొడా పొడి అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు వరలక్ష్మి. ఆ తర్వాత తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ వరుసగా సినిమాలు చేశారు. కొన్ని చిత్రాల్లో విలన్‍గా చేసి మెప్పించారు.
2019లో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రంతో టాలీవుడ్‍లో వరలక్ష్మి శతర్ కుమార్ అడుగుపెట్టారు. ఆ తర్వాత 2021లో రవితేజ హీరోగా నటించి క్రాక్ చిత్రంలో జయమ్మ అనే నెగెటివ్ రోల్ చేశారు. ఆ పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను వరలక్ష్మి మెప్పించారు. జయమ్మగానే పిలుస్తుంటారు. జాంబిరెడ్డి, నాంది సహా ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన హనుమాన్ సినిమాలో ఓ కీలకపాత్ర చేశారు వరలక్ష్మి. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ మూవీలో కీలకపాత్ర చేస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్.