వరలక్ష్మి శరత్ కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో ‘శివంగి: లయనెస్’ చిత్రం రూపొందింది. ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లను దక్కలేదు. శివంగి సినిమా ఓటీటీలోకి తెలుగు కంటే ముందు తమిళ డబ్బింగ్ వెర్షన్ రానుంది. ఈ మూవీ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది.
శివంగి చిత్రానికి దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఎప్పుడు రానుందంటే..
శివంగి చిత్రం తమిళ వెర్షన్ ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని ఆ ఓటీటీ ప్రకటించింది. “ఇది థ్రిల్లర్ టైమ్. శివంగి ది లయనెస్ చిత్రం ఏప్రిల్ 18న రానుంది” అని ఆహా తమిళ్ నేడు (ఏప్రిల్ 15) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
శివంగి సినిమా తెలుగులోనే తెరకెక్కింది. అయితే, తెలుగు కంటే ముందు తమిళ డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందో, ఆ రైట్స్ కూడా ఆహా వద్దే ఉన్నాయా అనేది చూడాలి.
శివంగి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఆనందితో పాటు జాన్ విజయ్, కోయా కిశోర్ కీలకపాత్ర పోషించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ భరణి ధరన్. ఈ చిత్రానికి ఏహెచ్ కాసిఫ్ సంగీతం అందించారు. నరేశ్ బాబు ప్రొడ్యూజ్ చేశారు.
సత్యభామ (ఆనంది) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంటారు. ఆఫీస్‍లో ఆమె వేధింపులు ఎదుర్కొంటూ ఉంటుంది. చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇంతలో ఓ హత్య చేసిందన్న అభియోగం కూడా ఆమెపై పడుతుంది. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్ కుమార్) దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని అనూహ్యమైన విషయాలు తెలుస్తాయి. విచారణలో సవాళ్లు ఎదురవుతాయి. ఆ హత్య ఎలా జరిగింది? సత్యభామకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ మర్డర్ మిస్టరీని పోలీస్ఆఫీసర్ ఛేదించారా? హత్య చేసిందెవరు? అనే విషయాలు శివంగి చిత్రంలో ఉంటాయి.
కాగా, తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ యమకాతగి రీసెంట్‍గా ఏప్రిల్ 14న ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో రూప కొడవాయూర్ లీడ్ రోల్ చేశారు. జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 7న విడుదలైంది. ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం