Psychological Thriller OTT: మరో ఓటీటీలో రిలీజైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - ఊహించని ట్విస్ట్‌లతో…
Psychological Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ శబరి మూవీ ఇటీవలే సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీకి అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు.
Psychological Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగు మూవీ శబరి మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సన్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా శనివారం నుంచి ఆహా ఓటీటీలోనూ ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్స్ట్‌లో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ కాగా...ఆహా ఓటీటీలో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
మిక్స్‌డ్ టాక్...
శబరి మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు.
మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్టింగ్ బాగుందనే టాక్ వచ్చిన...స్టోరీలో ఆసక్తి లోపించడం, మెయిన్ ట్విస్ట్‌లు తేలిపోవడంతో శబరి మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
శబరి పోరాటం...
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్), అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) ప్రేమవివాహం చేసుకుంటారు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి లైఫ్ అనుకోని మలుపులు తిరుగుతుంది. అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం సంజనకు తెలుస్తుంది. దాంతో కూతురు రియాను (బేబీ నివేక్ష) తీసుకొని భర్తకు దూరంగా (బేబీ నివేక్ష) వైజాగ్ వచ్చేస్తోంది సంజన.
సంజన కోసం వెతుకుతూ సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వైజాగ్‌వస్తాడు. సంజనను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ఎటాక్ నుంచి తప్పించుకున్న సంజన...సూర్యపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంజన. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తేలుతుంది. సంజననే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తారు.
నిజంగానే సంజనకు మానసిక సమస్య ఉందా? సూర్య చనిపోయింది నిజమేనా? సంజనను చంపాలని సూర్య ఎందుకు అనుకున్నాడు? సంజన గతం ఏమిటి? కూతురు రియాను తన దగ్గరకు రప్పించేందుకు అరవింద్ ఏం చేశాడు? సూర్య, అరవింద్ పన్నాగాల నుంచి తన కూతురిని సంజన ఎలా కాపాడుకుంది అన్నదే శబరిమూవీ కథ.
ఛాలెంజింగ్ రోల్స్...
తెలుగు, తమిళ భాషల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా చేస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. గత ఏడాది ఆమె నటించిన ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి. 2024లో తెలుగులో శబరితో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో హీరో సోదరిగా ఓ కీలక పాత్రలో కనిపించింది.
తమిళంలో ధనుష్ రాయన్‌లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. కిచ్చా సుదీప్ మ్యాక్స్‌లో విలన్‌గా నటిస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ భారీ బడ్జెట్ మూవీతో దాదాపు నాలుగేళ్ల తర్వాత కన్నడంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.