Valentines Night Movie Review: వాలెంటైన్స్ నైట్ మూవీ రివ్యూ - చైత‌న్య‌రావు సినిమా ఎలా ఉందంటే-valentines night movie telugu review chaitanya rao sunil crime thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Valentines Night Movie Telugu Review Chaitanya Rao Sunil Crime Thriller Movie Review

Valentines Night Movie Review: వాలెంటైన్స్ నైట్ మూవీ రివ్యూ - చైత‌న్య‌రావు సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2023 02:35 PM IST

Valentines Night Movie Review: చైత‌న్య‌రావు, సునీల్, లావ‌ణ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వాలెంటైన్స్ నైట్ సినిమా ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సామాజిక సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడిస్తూ రూపొందిన ఈ సినిమాకు అనిల్ గోపీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

చైత‌న్య‌రావు,
చైత‌న్య‌రావు,

Valentines Night Movie Review: 30 వెడ్స్ 20 వెబ్‌సిరీస్ ద్వారా న‌టుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు చైత‌న్య‌రావు. అత‌డు హీరోగా న‌టించిన తాజా చిత్రం వాలెంటైన్స్ నైట్‌. సునీల్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, లావ‌ణ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు అనిల్ గోపిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఇటీవ‌లే థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

ఆర్జే ప్రేమ‌క‌థ‌...

అజ‌య్ (చైత‌న్య‌రావు) ఆర్జేగా ప‌నిచేస్తుంటాడు. ప్రియ‌(లావ‌ణ్య‌) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. త‌న ఫ్యామిలీ కోసం ప్రియ‌కు ప్రేమకు అజ‌య్ బ్రేక‌ప్ చెప్పాల్సివ‌స్తుంది. రాఘ‌వ (శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌) స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌. త‌న వ్యాపార ప‌నుల్లో ప‌డి భార్య మాయ‌, కూతురు వేద‌ను నిర్ల‌క్ష్యం చేస్తాడు. వేద డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారుతుంది. రాహుల్‌ను ప్రేమిస్తుంటుంది.

త‌న ఫ్యామిలీకి ఎదురైన ఓ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మాయ త‌న స్నేహితుడు మాడీ (ర‌వివ‌ర్మ‌) స‌హాయం కోరుతుంది. మ‌రోవైపు సిటీలో డ్ర‌గ్స్ వ్యాపారాన్ని అరిక‌ట్ట‌డానికి నియ‌మించ‌బ‌డిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ కృష్ణ‌మోహ‌న్‌కు(సునీల్‌) డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ అలీ (ముక్కు అవినాష్‌) దొర‌కుతాడు. అత‌డి ద్వారా డ్ర‌గ్స్ దందా గురించి కృష్ణ మోహ‌న్ ఏం తెలుసుకున్నాడు? డ్ర‌గ్స్ దందా న‌డుపుతోన్న దాదా ఎవ‌రు? తాను ప్రేమించిన రాహుల్ వ‌ల్ల వేద ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్న‌ది.

ప్రాణంగా ప్రేమించిన ప్రియ‌ను అజ‌య్‌ మ‌ళ్లీ క‌లుసుకున్నాడా? వ్యాపార‌మే ముఖ్య‌మ‌ని అనుకున్న రాఘ‌వ త‌న త‌ప్పును ఎలా తెలుసుకున్నాడు? స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే సినిమాలు తీసిన వెలుగు కృష్ణ‌మూర్తి (పోసాని కృష్ణ‌ముర‌ళి) జీవితం ఏమైంది? అన్న‌దే వాలెంటైన్స్ నైట్ సినిమా క‌థ‌.

నేటిత‌రం యువ‌త క‌థ‌...

నేటిత‌రం యువ‌త జీవిన శైలిని వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రిస్తూ వాలెంటైన్స్ నైట్ సినిమాను ద‌ర్శ‌కుడు అనిల్ గోపీరెడ్డి రూపొందించారు. బిజీలైఫ్ కార‌ణంగా కుటుంబానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేని త‌ల్లిదండ్రుల వ‌ల్ల మితిమీరిన స్వేచ్ఛ‌తో పిల్ల‌లు ఎలా అడ్డ‌దారులు తొక్కుతూ త‌మ జీవితాల్ని నాశ‌నం చేసుకుంటున్నారోన‌నే సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు.

అంత‌ర్లీనంగా అజ‌య్‌, ప్రియ ల‌వ్‌స్టోరీని జోడించారు. ప్రేమ‌క‌థ‌తో పాటు త‌ల్లిదండ్రులు ప్రేమ‌కు దూర‌మై డ్ర‌గ్స్ బానిస‌గా మారిన అమ్మాయి, డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌గా మారిన ఓ అనాథ యువ‌కుడు...సామాజిక బాధ్య‌త‌తో సినిమాలు తీసే నిర్మాత...ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఇలా భిన్న నేప‌థ్యాలు క‌లిగిన క్యారెక్ట‌ర్స్‌ను ఇన్‌వాల్వ్ చేస్తూ క‌థ‌ను రాసుకున్నారు. ఒక్క నైట్‌లోనే వారింద‌రి జీవితాలు ఎలా మారిపోయాయో ఈ సినిమాలో (Valentines Night Movie Review)చూపించారు.

రియాలిటీ మిస్‌...

పాయింట్ బాగున్నా క‌థ‌తో పాటు క్యారెక్ట‌ర్స్‌ను తెర‌పై అర్ధ‌వంతంగా ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు చాలా చోట్ల త‌డ‌బ‌డ్డారు. సినిమాలో వాస్త‌విక‌త మిస్స‌యింది. అజ‌య్‌, ప్రియ ల‌వ్‌స్టోరీతో పాటు చాలా సీన్స్ ఆర్టిఫిషియ‌ల్‌గా సాగుతాయి. క‌థాగ‌మ‌నం నిదానంగా సాగ‌డం పెద్ద మైన‌స్‌గా మారింది. బోల్డ్ స‌న్నివేశాలు కాస్త హ‌ద్దులు దాటిన‌ట్లుగా అనిపించింది. చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కనిపించవు.

చైత‌న్య రావు ప్ల‌స్‌...

ప్రేమ కంటే కుటుంబ‌మే ముఖ్య‌మ‌ని న‌మ్మే ఆర్జేగా చైత‌న్య‌రావు న‌ట‌న బాగుంది. అత‌డి క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా సీరియ‌స్‌గా క‌నిపిస్తూనే త‌న కామెడీ టైమింగ్‌తో సునీల్ న‌వ్వించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వివ‌ర్మ‌, ముక్కు అవినాష్‌, లోబో క్యారెక్ట‌ర్స్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

బ‌లాలు

చైత‌న్య రావు, సునీల్ యాక్టింగ్‌

క‌థ‌

మ్యూజిక్‌

బ‌ల‌హీన‌త‌లు

నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం

బోల్డ్ సీన్స్‌

IPL_Entry_Point