Love Me Twitter Review: దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశీష్. అతడు హీరోగా నటించిన రెండో మూవీ లవ్ మీ ఆఫ్ యూ డేర్ శనివారం థియేటర్లలో రిలీజైంది.
హారర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
లవ్ మీ మూవీలో దయ్యంతో ఓ యువకుడు ప్రేమలో పడటం అనే పాయింట్ కొత్తగా ఉందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. స్టోరీ ఐడియాను దర్శకుడు ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడని చెబుతోన్నారు. అయితే ఈ పాయింట్‌ను స్క్రీన్‌పై హారర్ అంశాలతో థ్రిల్లింగ్‌గా చెప్పడంలో మాత్రం అరుణ్ భీమవరపు సక్సెస్ కాలేకపోయాడని అంటున్నారు.
స్క్రీన్‌ప్లే చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉందని, హీరో దయ్యంతో ప్రేమలో ఎందుకు పడతాడనే అంశాన్ని దర్శకుడు కన్వీన్సింగ్‌గా స్క్రీన్‌పై చూపించలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. సిల్లీ సీన్స్, ఔట్ డేటెడ్ కామెడీతో లవ్ మూవీ ఇఫ్ యూ డేర్ మూవీ ఓపికకు పరీక్షగా నిలుస్తుందని చెబుతోన్నారు.
సినిమాలోని ట్విస్ట్‌ల్లో డెప్త్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథలో బలం లేకపోవడంతో కీరవాణి మ్యూజిక్ కూడా మూవీని కాపాడలేకపోయిందని అంటున్నారు. పాటలతో పాటు బీజీఎమ్ కథతో సంబంధం లేకుండా సాగిన ఫీలింగ్‌ను కలిగిస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు వైష్ణవి చైతన్య క్యారెక్టర్, ఆమె యాక్టింగ్ కొంత వరకు ప్లస్ పాయింట్‌గా నిలిచినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తోన్నాయి. దయ్యంగా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించినట్లు చెబుతోన్నారు.
ఆశీష్ సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడని చెబుతున్నారు. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం తేలిపోయినట్లు చెబుతోన్నారు. రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి క్యారెక్టర్స్‌కు పెద్దగా స్కోప్ లేదని పేర్కొంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ హారర్ మూవీ ప్రేక్షకులను మెప్పించడం కష్టమేనని ఓవర్‌సీస్ ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. రెండు కంటే తక్కువే రేటింగ్‌లు ఇస్తున్నారు. తర్వాత వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది. లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీకి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో మే 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
టాపిక్