Vaishnavi Chaitanya: రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన వైష్ణవి చైతన్య- కోటి తీసుకుంటున్న తెలుగమ్మాయిగా బేబీ హీరోయిన్?-vaishnavi chaitanya demand to increase her remuneration rs 1 cr after baby movie and record as first telugu actress ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vaishnavi Chaitanya: రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన వైష్ణవి చైతన్య- కోటి తీసుకుంటున్న తెలుగమ్మాయిగా బేబీ హీరోయిన్?

Vaishnavi Chaitanya: రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన వైష్ణవి చైతన్య- కోటి తీసుకుంటున్న తెలుగమ్మాయిగా బేబీ హీరోయిన్?

Sanjiv Kumar HT Telugu

Vaishnavi Chaitanya Remuneration ₹1 Cr: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య అమాంతం తన రెమ్యునరేషన్ పెంచిందని జోరుగా ప్రచారం సాగుతోంది. బేబీ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య తన అప్‌కమింగ్ మూవీ కోసం ఏకంగా రూ. కోటి పారితోషికం అందుకోనుందని టాక్ నడుస్తోంది.

వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya Remuneration 1 Cr: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందం, అభినయం ఉన్న ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌ కాలేకపోయారు. ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్స్‌కు ధీటుగా రాణించలేకపోయారు.

అతి తక్కువ మందిలో

కానీ, కొంతమంది మాత్రం ఆకట్టుకునే పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో కాకపోయినా క్రేజీ నేమ్ తెచ్చుకుంటున్నారు. అలాగే, కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్స్‌గా కూడా మారారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు.

కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. అనంతరం 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకుంది. ఇక బేబీ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకున్న వైష్ణవి చైతన్య తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

యూత్‌లో క్రేజ్

'బేబీ' సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కథ మొత్తం హీరోయిన్ వైష్ణవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాగే, ఆమె నటన, వైష్ణవి చైతన్య, హీరోల మధ్య వచ్చే సీన్స్ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాయి. అంతేకాకుండా బేబీ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వైష్ణవి చైతన్యకు మంచి పేరు వచ్చింది. యూత్‌లో సూపర్ క్రేజ్ వచ్చింది.

ఇక ఇప్పుడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్'లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేయనుంది. వైష్ణవి చైతన్య డ్యూయెల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్‌పై అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు.

జాక్‌తోపాటు మరో సినిమా

ఏప్రిల్ 10న జాక్ మూవీ విడుదల కానుంది. దీంతో పాటు 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటించనుంది. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించనున్నారు.

ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్‌గా చేస్తూ బిజీగా ఉన్న వైష్ణవి చైతన్య ఒక్కసారిగా రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. తన అప్‌కమింగ్ సినిమా కోసం వైష్ణవి చైతన్య దాదాపుగా రూ. కోటి పారితోషికం డిమాండ్ చేసిందని సోషల్ మీడియా టాక్. అంతేకాకుండా రీసెంట్‌గా ఓ యువ నిర్మాత, దర్శకుడు వైష్ణవి చైతన్యకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్లు సమాచారం.

కారణం ఇదేనా?

ఒకవేళ ఇదే నిజం అయితే కోటి రూపాయలు అందుకుంటున్న తెలుగు అమ్మాయిగా వైష్ణవి చైతన్య రికార్డ్ కొట్టినట్లే. అయితే, టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఫామ్‌లో లేకపోవడం, వారు అత్యధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వైష్ణవి చైతన్య బెస్ట్ ఆప్షన్‌గా దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వైష్ణవికి రూ. కోటి పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఇంటర్నెట్‌లో వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై వైష్ణవి చైతన్య క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం