Love Me Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న వైష్ణవి చైతన్య లవ్‍మీ సినిమా.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్
Love Me OTT Release: లవ్ మీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా గురించి ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా అప్‍డేట్ ఇచ్చింది. దీంతో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఏదో క్లారిటీ వచ్చేసింది.
Love Me OTT: యంగ్ హీరో ఆశిష్, బేబితో బ్లాక్‍బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య జంటగా 'లవ్ మీ' మూవీ వచ్చింది. మే 25వ తేదీన ఈ హారర్ రొమాంటిక్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండడం, ప్రమోషన్లను జోరుగా చేయడంతో మంచి బజ్ మధ్య ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకొని లవ్ మీ సినిమా కలెక్షన్ల విషయంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్
లవ్ మీ సినిమాపై అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటన చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఈ చిత్రం రానుందని ఖరారైంది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇప్పుడు ప్రకటించలేదు ఆ ప్లాట్‍ఫామ్. త్వరలోనే డేట్ వెల్లడించనుంది.
లవ్ మీ మూవీ త్వరలో ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తుందంటూ ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్‍రాజు ప్రొడక్షన్స్ కూడా ట్వీట్ చేసింది. చిల్స్, థ్రిల్స్‌తో ఉండే అల్టిమేట్ లవ్ స్టోరీ కోసం సిద్ధంగా ఉండాలని, ప్రైమ్ వీడియోలో త్వరలోనే వస్తోందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.
లవ్ మీ సినిమా మరో వారంలోనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టినట్టు కానుంది. మరో రెండు, మూడు రోజుల్లో స్ట్రీమింగ్ డేట్ వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు, ఆహా ఓటీటీ కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందనే సమచారం బయటికి వచ్చింది. మరి ఈ చిత్రం రెండు ఓటీటీల్లోనూ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
లవ్ మీ చిత్రంలో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా చేయగా.. రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల కీరోల్స్ చేశారు. దెయ్యాన్ని ప్రేమించడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించడం, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పని చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఆరంభం అదిరినా..
లవ్ మీ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్ల కలెక్షన్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఆ తర్వాత వసూళ్లు తగ్గాయి. ఆరంభం అదిరినా అనంతరం కలెక్షన్ల జోరు తగ్గింది. దీంతో అంచనాల మేరకు ఈ చిత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీని దిల్‍రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.
నెట్‍ఫ్లిక్స్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’
విశ్వక్‍సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఈ వారం జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, రెండు వారాల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.