Love Me: రొమాంటిక్ హారర్ సినిమా ‘లవ్ మీ’ రిలీజ్‍కు రెడీ అయింది. ఇప్పటికే వాయిదాలు పడుకుంటూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మరో మూడో రోజుల్లో మే 25వ తేదీన థియేటర్లలోకి రానుంది. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్‍గా చేశారు. లవ్ మీ మూవీకి ప్రమోషన్లను కూడా టీమ్ జోరుగా చేస్తోంది.
ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ఆశిష్ రెడ్డి ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. లవ్ మీ సినిమాలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారని, దెయ్యంతో కలుపుకుంటే ఆరుగురు అవుతారని చెప్పారు.
లవ్ మీలో వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్ అని, ప్రేక్షుకులు సర్‌ప్రైజ్ అయ్యేందుకు మిగిలిన వారి పేర్లను వెల్లడించలేదని ఆశిష్ తెలిపారు. “ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. బిగ్‍స్క్రీన్‍పై చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవ్వాలని మేం అనుకుంటున్నాం. అందుకే ఇప్పటి వరకు వారి గురించి వెల్లడించలేదు. వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్. సినిమా నడుస్తున్న కొద్దీ ఇతర హీరోయిన్లు కనిపిస్తుంటారు. దెయ్యం పాత్రను కూడా కలుపుకుంటే.. లవ్ మీ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు” అని ఆశిష్ చెప్పారు.
లవ్ మీ సినిమాలో యంగ్ హీరోయిన్ సిమ్రన్ చౌదరి కూడా కనిపిస్తారనే టాక్ ఉంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సీజన్ 4 గేమ్‍షోలో ఆశిష్, వైష్ణవి చైతన్య పాటు సిమ్రన్ చౌదరి కూడా పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రంలో సిమ్రన్ కనిపించనున్నారనే రూమర్లు ఉన్నాయి. మరి ఆశిష్ చెప్పిన ఆ హీరోయిన్లు ఎవరో మే 25న ఈ మూవీ రిలీజ్ రోజు తేలిపోనుంది.
లవ్ మీ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అలాగే, రన్‍టైమ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 16 నిమిషాల (136 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుందని తెలుస్తోంది.
లవ్ మీ సినిమా నుంచి ‘ఏం అవుతుందో’ అనే పాటను నేడు (మే 22) సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. లెజెండ్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాటను లాంచ్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. లవ్ మీ టీమ్‍కు విషెస్ చెప్పారు మహేశ్. చంద్రబోస్ లిరిక్స్ రాసిన ఏం అవుతుందో పాటను నితీశ్ కొండిపర్తి, గోమతి అయ్యర్ ఆలపించారు. ఆస్కార్ విజేత కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తుండడం హైలైట్‍గా ఉంది. అలాగే, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ మూవీకి వర్క్ చేశారు.
దెయ్యంతో లవ్, రొమాన్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో లవ్ మీ సినిమా వస్తోంది. ట్రైలర్ కూడా ఆసక్తి రేపింది. ఈ సినిమాను డైరెక్టర్ అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్‍రాజు ప్రొడక్షన్స్ ఎల్ఎల్‍పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం