Aadikeshava Trailer: ఆది కేశవ ట్రైలర్.. పది తలకాయలోడు అయోధ్య మీద పడితే.. వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం!
Vaishnav Tej Aadikeshava Trailer: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. తాజాగా ఆదికేశవ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూడటంతోపాటు డైలాగ్స్ అదిరిపోయాయి.
Aadikeshava Trailer Released: తొలి మూవీ ఉప్పెనతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఈ మూవీ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలతో అలరించిన ఉప్పెన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మాస్ అండ్ యాక్షన్‌తో రాబోతున్న సినిమా ఆదికేశవ.
ట్రెండింగ్ వార్తలు
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోన్న ఆదికేశవ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేశారు మేకర్స్. ఆదికేశవ ట్రైలర్‌లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ సాగింది. ముఖ్యంగా శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మధ్య వచ్చే సీన్స్ చాలా క్యూట్‌గా బాగున్నాయి. కమెడియన్ సుదర్శన్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక వాటికి మించి మలయాళ పాపులర్ నటుడు జోజు జార్జ్ విలనిజం కనిపించింది.
"రాముడు లంకపై పడింది ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో సూపిస్తా" అని జోజు జార్జ్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది. జోజు జార్జ్‌కు డబ్బింగ్ కూడా సూపర్‌గా సెట్ అయింది. జోజు జార్జ్‌కు ఇదే తొలి తెలుగు సినిమా అయినా, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.
ఇక జోజు జార్జ్ డైలాగ్‌కు వైష్ణవ్ తేజ్ వేసే కౌంటర్ విజిల్ కొట్టించేలా ఉంది. "నేను అయోధ్యలోని రాముడిని కాదప్ప.. ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని.. తలలు కోసి సేతికిస్తా నాయాలా" అనే డైలాగ్‌కి థియేటర్లు మారుమోగిపోయేలా ఉంది. ఇందులో వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూడొచ్చు. రక్తంతో విలన్స్ ని నరుకుతూ.. నిజంగానే రుద్రకాళేశ్వరుడిలా కనిపించాడు. జీవీ ప్రకాష్ బీజీఎమ్ బాగుంది. ఆదికేశవ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.
కాగా ఆది కేశవ సినిమాలో అపర్ణ దాస్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఆదికేశవ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇటీవల విడుదలైన మ్యాడ్ సినిమాలో నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించగా.. డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.