Vadhuvu OTT Release Date: అవికా గోర్ వెబ్ సిరీస్ వధువు స్ట్రీమింగ్ డేట్ ఖరారు!.. ఉత్కంఠ రేకెత్తించేలా టీజర్
Vadhuvu OTT Release Date: అవికా గోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వధువు వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో వెల్లడైంది. అలాగే, ఈ సిరీస్ టీజర్ కూడా వచ్చింది.
Vadhuvu OTT Release Date: అవికా గోర్ ప్రధాన పాత్రలో మరో వెబ్ సిరీస్ వస్తోంది. ‘వధువు’ పేరుతో ఈ సిరీస్ రూపొందుతోంది. ఇటీవల వరుసగా ఓటీటీ సిరీస్‍ల్లో అవికా నటిస్తున్నారు. ఇటీవలే ఓంకార్ దర్శకత్వంలో మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‍లో ఆమె చేశారు. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్‍లో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రానుంది. కాగా, వధువు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది.
వధువు వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. హాట్‍స్టార్‌లో రిమైండ్ మీ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వివరాలు తెలిశాయి. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. బెంగాలీ సిరీస్ హోయ్‍చాయ్‍కు రీమేక్‍గా వధువు వెబ్ సిరీస్ రూపొందుతోంది. వధువు థ్రిల్లర్ సిరీస్ టీజర్‌ను కూడా డిస్నీ+ హాట్‍స్టార్ నేడు రిలీజ్ చేసింది.
పెళ్లి చేసుకొని ఓ ఇంట్లో అడుగు పెడతారు అవికా గోర్. అయితే, ఆ ఇంట్లో విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఇంట్లోని విషయాలు కోడలికి తెలియకూడదు అనే డైలాగ్ టీజర్లో ఉంది. మిస్టీరియస్ ఫ్యామిలీ అనే వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ముగిసింది. తన అత్తారింటి రహస్యాలను అవికా కనుగొంటారా.. మిస్టరీని ఛేదిస్తారా.. సమస్యలు పరిష్కరిస్తారా అనేదే ఈ సిరీస్ కథాంశంగా అర్థమవుతోంది.
వధువు వెబ్ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీరోల్స్ చేస్తున్నారు. ఎస్‍వీఎఫ్ పతాకంపై అభిషేక్ దాగా ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు.
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో బాలనటిగా అవికా గోర్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. తెలుగు మూవీ ఉయ్యాల జంపాలతో హీరోయిన్ అయ్యారు అవిక. ఆ తర్వాత వరుసగా చాలా సినిమాల్లో నటించారు. అయితే, వరుసగా కొన్ని ఫ్లాఫ్‍లు వచ్చే సరికి అవికాకు సినిమా అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఓటీటీ సిరీస్‍ల్లో ఎక్కువగా నటిస్తున్నారు అవిక.