Ustad Bhagat Singh First Glimpse: ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది-ustad bhagat singh first glimpse released by the makers on may 11 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ustad Bhagat Singh First Glimpse: ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

Ustad Bhagat Singh First Glimpse: ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu

Ustad Bhagat Singh First Glimpse: ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంచనా వేసినట్లే ఈ గ్లింప్స్ అదిరిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్

Ustad Bhagat Singh First Glimpse: ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లే ఊర మాస్ లుక్ లో పవన్ ఈ గ్లింప్స్ లో కనిపించాడు. లుంగీ కట్టుకొని ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. తర్వాత పోలీస్ డ్రెస్ లో తన మార్క్ డైలాగులతో అదరగొట్టాడు. పాతబస్తీలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించనున్నాడు. గ్లింప్స్ చివర్లో ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది అనే డైలాగుతో పవన్ ముగించాడు.

భగవద్గీత శ్లోకంతో ఈ గ్లింప్స్ మొదలైంది. ఏ యుగంలో అధర్మం రాజ్యమేలుతుందో ఆయా యుగాల్లో అవతారము దాల్చుతున్నాననే డైలాగుతో గ్లింప్స్ ప్రారంభం కాగానే.. పవన్ ఎంట్రీ ఇచ్చాడు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి గురువారం (మే 11) ఉదయం ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో పవన్ ఫ్యాన్స్ మధ్య గ్రాండ్ గా ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది.

ఈ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ థియేటర్ కు తరలివచ్చారు. కొందరు అభిమానులు జనసేన జెండాలతోనూ కనిపించారు.

గబ్బర్‌సింగ్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వస్తుంది అంటేనే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలా ఒకే రోజు మేకర్స్ రెండు సర్‌ప్రైజ్ లు ఇవ్వడంతో పీఎస్‌పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

కళ్లజోడు పెట్టుకుని లైట్ గడ్డంతో తీక్షణంగా చూస్తున్న పవర్ స్టార్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అంతేకాకుండా ఆయన బ్యార్ కేడ్‌ పక్కన నిలుచున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో నిరసనను కంట్రోల్ చేయడానికో లేక మద్దతు తెలపడానికో వచ్చినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. అయనకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.