పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చే న్యూస్. రీసెంట్ గా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ హరి హర వీరమల్లు థియేటర్లలో రిలీజైంది. జులై 24న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. వీళ్లకు మరింత కిక్ అందించే వార్త ఇది. పవన్ కల్యాణ్ రాబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (ustaad bhagat singh) క్లైమాక్స్ షూట్ ను పవన్ కంప్లీట్ చేశారు.
హరి హర వీరమల్లు మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. రికార్డులు తిరగరాస్తుందనుకున్న మూవీ కలెక్షన్లు పడిపోయాయి. మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని సీన్లు కట్ చేసి, వీఎఫ్ఎక్స్ సీన్లు బెటర్ గా చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తర్వాతి సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ భారీగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్లుగా ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీక్వెన్స్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు. ఫుల్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో ఈ క్లైమాక్స్ ఉండబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
‘‘ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయింది. నటకంఠ మాస్టర్ పర్యవేక్షణలో ఎమోషనల్, యాక్షన్ తో కూడిన ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ రూపు దిద్దుకుంది. క్యాబినేట్ మీటింగ్స్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలున్నా, హరి హర వీరమల్లు ప్రమోషన్లలో బిజీగా ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షూటింగ్ ను స్పీడ్ గా కంప్లీట్ చేశారు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్కింగ్ నేచర్ కు ఇది నిదర్శనం’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు. అలాగే కొత్త స్టిల్ పంచుకున్నారు.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
సంబంధిత కథనం