Ram Boyapati Srinu Movie: రామ్ బోయ‌పాటి శ్రీను సినిమాలో బాలీవుడ్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌-urvashi rautela to shake a leg for a special number in ram boyapati srinu movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvashi Rautela To Shake A Leg For A Special Number In Ram Boyapati Srinu Movie

Ram Boyapati Srinu Movie: రామ్ బోయ‌పాటి శ్రీను సినిమాలో బాలీవుడ్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 27, 2022 09:30 AM IST

Ram Boyapati Srinu Movie: బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా తెలుగులో అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో ఆమె క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఊర్వ‌శి రౌటేలా
ఊర్వ‌శి రౌటేలా

Ram Boyapati Srinu Movie: రిష‌బ్ పంత్ వివాదంతో ఇటీవ‌ల వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలిచింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా. ఈ వివాదంతో నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓ ప్ర‌త్యేక గీతానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అఖండ ఘ‌న విజ‌యం త‌ర్వాత యంగ్ హీరో రామ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.

ట్రెండింగ్ వార్తలు

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. కాగా ఈ సినిమాలో ఐటెంసాంగ్‌లో ఊర్వ‌శి రౌటేలా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది.

సోష‌ల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చిత్ర యూనిట్ ఇటీవ‌లే ఊర్వ‌శిని సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. ఆమె ఈ స్పెష‌ల్ సాంగ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్‌తో కాబిల్‌తో పాటు ప‌లు సినిమాల్లో ప్ర‌త్యేక గీతాల్లో ఊర్వ‌శి త‌ళుక్కున మెరిసింది.

ఈ పాట‌ల్లో ఆమె డ్యాన్సులు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఆ ఆలోచ‌న‌తోనే ఊర్వ‌శిని చిత్ర యూనిట్ ఎంపిక‌చేసిన‌ట్లు చెబుతున్నారు. రామ్ బోయ‌పాటి శ్రీను సినిమాతోనే ఊర్వ‌శి టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఊర్వ‌శి తెలుగులో బ్లాక్ రోజ్ పేరుతో ఓ సినిమా చేసింది. కొవిడ్ కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.