ఫ్యాషన్ లో ట్రెండ్ సెట్ చేస్తూ హాట్ లుక్స్ తో అదరగొట్టే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఆమె తళుక్కుమని మెరిసింది. గత కొంత కాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెగ్యులర్ గా పాల్గొంటోంది ఊర్వశి.
హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మంగళవారం (మే 13) పార్టిర్ అన్ జోర్ (లీవ్ వన్ డే) సినిమా ప్రారంభోత్సవం, ప్రదర్శన కోసం రెడ్ కార్పెట్ మీద నడిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కోసం రంగురంగుల దుస్తులు ధరించి, చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ ను పట్టుకుని వచ్చింది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పట్టుకున్న చిలుక బ్యాగ్ మరింత అట్రాక్షన్ గా మారింది.
రెడ్ కార్పెట్ పై ఊర్వశి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీలం, ఎరుపు, పసుపు రంగులలో స్ట్రాప్ లెస్ స్ట్రక్చర్డ్ డ్రెస్ లో హొయలు ఒలింకించింది ఊర్వశి. మ్యాచింగ్ టియారాతో ఆమె తన లుక్ ను కంప్లీట్ చేసింది.
కానీ అందరి దృష్టి ఆమె తీసుకెళ్లిన చిలుక క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ పైనే ఉంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడం కూడా ఒక ఫోటోలో కనిపిస్తుంది. ఈ క్లచ్ ను జుడిత్ లీబర్ తయారు చేశారని, ఈ బ్యాగ్ ధర 5,495 డాలర్లు (రూ.4,68,064.10) అని ఇన్ స్టాగ్రామ్ పేజీ డైట్ సబ్యా పేర్కొంది.
ఊర్వశి డ్రెస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. "డిజైన్ మెషీన్ స్టూడియోలా అందంగా ఉంది" అని ఒక వ్యక్తి చమత్కరించాడు. ఇంకొకరు 'నేను అలాంటి అభిమానిని' అని రాసుకొచ్చారు. ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఊర్వశి తాజా చిత్రం డాకు మహారాజ్ ను కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారా? అని ప్రశ్నించాడు.
2024లో ఊర్వశి జహంగీర్ నేషనల్ యూనివర్శిటీలో నటించింది. 2025లో బాలక్రిష్ణతో కలిసి డాకు మహారాజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ ‘దబిది దిబిడి’ చేసింది. ఈ సాంగ్ లోఅశ్లీల నృత్య స్టెప్పులతో విమర్శల పాలైంది. ఆ తర్వాత జాత్ లో టచ్ కియా అనే పాటతో అలరించింది. వెల్ కమ్ టు ది జంగిల్, కసూర్ 2 చిత్రాల్లో నటిస్తోంది.
సంబంధిత కథనం