Urvashi Rautela: నేను నిమిషానికి రూ. కోటి వసూలు చేస్తా: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Urvashi Rautela: నేను నిమిషానికి రూ. కోటి వసూలు చేస్తా అంటూ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తెలుసు కదా. ఈ మధ్య తరచూ టాలీవుడ్ మూవీస్ లోనూ స్పెషల్ అప్పియరెన్స్ లతో మెస్మరైజ్ చేస్తోంది. వాల్తేర్ వీరయ్య, ఏజెంట్, బ్రో మూవీల్లో ఊర్వశి మెరిసింది. రాబోయే స్కంద మూవీలోనూ నటించింది. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలోనే తాను అత్యధిక మొత్తం అందుకునే హీరోయిన్ అని, నిమిషానికి రూ. కోటి వసూలు చేస్తానని అనడం విశేషం.
ఈ మధ్యే ఊర్వశి రౌతేలా ముంబైలో ఏకంగా రూ.190 కోట్లు పెట్టి ఓ లగ్జరీ విల్లా కొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదంతా ఉత్త పుకార్లే అని తేలింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను నిమిషానికి రూ.కోటి వసూలు చేస్తానని ఆమె చెప్పింది. ఓ ఛానెల్ రిపోర్టర్ ఓ ఈవెంట్లో ఆమెను ఇంటర్వ్యూ చేశాడు.
మీరు నిమిషానికి రూ.కోటి వసూలు చేస్తారట.. ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకునే హీరోయిన్ అట.. ఎలా ఫీలవుతున్నారు అని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. "ఇది చాలా మంచి విషయం. తనకు తానుగా ఓ మంచి నటిగా ఎదిగిన ఎవరైనా ఇలాంటి రోజు ఒకటి చూడాలి" అని ఊర్వశి చెప్పింది. ఈ కామెంట్స్ చూసి ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అన్నీ అబద్ధాలే.. నువ్వు ఇండియాలో అత్యధిక మొత్తం అందుకునే నటివేంటి.. అసలు నీకెవరు అంత మొత్తం ఇస్తున్నారు.. నిన్నెవరు చూస్తారు అంటూ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఊర్వశి వార్తల్లో నిలిచింది. ఇక ఈ ఏడాది కేన్స్ లోనూ మెరిసిన ఊర్వశి.. అంతకుముందు ఏకంగా రూ.277 కోట్ల ఖరీదైన మొసలి ఆకారంలోని నెక్లెస్ తో ఫొటోలకు పోజులిచ్చి వార్తల్లో నిలిచింది.