Urvashi Rautela: ఊర్వశి రౌటేలా హీరోయిన్‌గా నటించిన అడల్ట్ కామెడీ మూవీ వర్జిన్ భానుప్రియ అల్ట్రా ప్లే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అల్ట్రా ప్లే ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వర్జిన్ భానుప్రియ మూవీ కోవిడ్ కారణంగా థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. వర్జిన్ భానుప్రియ మూవీకి అజయ్ లోహాన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఊర్వశి రౌటేలాతో పాటు గౌతమ్ గులాటి, అర్చన పురాన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ బాలీవుడ్ మూవీలో భానుప్రియ అనే మోడ్రన్ యువతిగా బోల్డ్‌రోల్‌లో ఊర్వశి రౌటేలా కనిపించింది. భానుప్రియ చదువులో టాపర్. తల్లిదండ్రులు గొడవలు పడి విడిపోతారు. వారిని కలిపేందుకు భానుప్రియ చేసిన ప్రయత్నాలు ఫెయిలవుతాయి. మరోవైపు ప్రేమ పేరుతో భానుప్రియ లైఫ్‌లోకి అభిమన్యు, రాజీవ్, ఇర్ఫాన్‌తో పాటు మరో వ్యక్తి వస్తాడు? ఈ నలుగురిలో భానుప్రియ ఎవరిని ప్రేమించింది? ఎవరి కారణంగా వర్జినిటీ కోల్పోయింది అన్నదే ఈ మూవీ కథ. వర్జినిటీ విషయంలో ఉండే అపోహలతో అడల్డ్ కామెడీ మూవీగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
తాను అనుకున్న పాయింట్‌ను అర్థవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడటం, కామెడీ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ యావరేట్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీలో పదికిగాను కేవలం 2.5 రేటింగ్‌ను మాత్రమే సొంతం చేసుకున్నది.
హీరోయిన్‌గా కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది ఊర్వశి రౌటేలా. తెలుగులో వాల్తేర్ వీరయ్య మూవీలో బాస్ పార్టీ పాటలో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసింది. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏజెంట్, స్కంద, బ్రో సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసింది. ఇటీవల సంక్రాంతికి రిలీజైన డాకు మహారాజ్ మూవీలో ఎస్ఐ జానకి పాత్రలో కనిపించింది. బాలకృష్ణతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌లో మెరిసింది.
తెలుగులో హీరోయిన్‌గా బ్లాక్‌రోజ్ అనే సినిమా చేసింది. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మాత్రం రిలీజ్ కాలేదు. హిందీలో కొన్ని సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తోంది.
సంబంధిత కథనం