మహానటి కీర్తి సురేశ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. టాలీవుడ్‌లో యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరోగా సుహాస్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి కీర్తి సురేశ్, సుహాస్ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది. అయితే, అది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఆ మూవీనే ఉప్పు కప్పురంబు. కీర్తి సురేశ్, సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించారు. ఉప్పు కప్పురంబు సినిమాలో కీర్తి సురేశ్, సుహాస్‌తోపాటు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.
వసంత్ మారింగంటి రచించిన ఉప్పు కప్పురంబు సినిమా 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలోని ప్రజలు, వారి ఖనన (అంత్యక్రియలు) మౌలిక సదుపాయాలపై సెటైరికల్‌గా ఉప్పు కప్పురంబు సినిమాను రూపొందించారు.
అమెజాన్ ప్రైమ్‌లో ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు ఓటీటీ రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 4 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది.
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కిపైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోలో స్పెషల్‌గా ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (జూన్ 16) అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.
"ప్రైమ్ వీడియోలో మేము కథ చెప్పే మా పరిధిని విస్తృతం చేయడానికి, విస్తృత శ్రేణి ప్రేక్షకులు ఆకట్టుకునేందుకు, సాంస్కృతికంగా పాతుకుపోయిన వైవిధ్యమైన కథనాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ అండ్ ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ తెలిపారు.
"ఉప్పు కప్పురంబు అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన, విచిత్రమైన సెటైరికల్ చిత్రం. ఇది ప్రామాణికమైన గ్రామీణ వాతావరణ సారాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఒక అసాధారణమైన ఇతివృత్తాన్ని తెరపైకి తెస్తుంది. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేశ్, సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో పాటు ఐవి. శశి ప్రత్యేకమైన దృష్టిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకెళ్లడం మాకు గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత కథనం