Upendra UI Movie OTT: ఓటీటీలోకి ఉపేంద్ర మూవీ యూఐ.. పుకార్లకు చెక్ పెట్టిన టీమ్.. ఆ ప్లాట్‌ఫామ్‌కు దక్కలేదంటూ..
Upendra UI Movie OTT: ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ (UI) మూవీ వచ్చేస్తోందని, ప్లాట్‌ఫామ్ ఇదే అంటూ వస్తున్న వార్తలను ఆ మూవీ టీమ్ ఖండించింది. అందులో నిజం లేదని, వీటిపై తమ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని కోరింది.
Upendra UI Movie OTT: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన మూవీ యూఐ (UI). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. మరో డిస్టోపియన్ ఫ్యూచర్ యాక్షన్ మూవీగా వచ్చిన యూఐకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ (Sun NXT) సొంతం చేసుకుందని వస్తున్న వార్తలు ఆ మూవీ టీమ్ బుధవారం (జనవరి 8) ఖండించింది. అందులో నిజం లేదని స్పష్టం చేసింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
యూఐ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన మూవీ యూఐ. ఈ సినిమా గత నెల డిసెంబర్ 20న రిలీజ్ అయింది. అయితే రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రెండు వారాల్లో కేవలం రూ.30 కోట్లే వచ్చాయి. సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
అయితే ఈ సినిమా స్ట్రీమింగ్, టీవీ పార్ట్‌నర్ ఎవరన్నది మూవీ టైటిల్స్ సమయంలో వేయలేదు. దీంతో సన్ నెక్ట్స్ కే దక్కినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదంటూ తమ సోషల్ మీడియా ద్వారా యూఐ మూవీ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ పుకార్లపై నిర్మాత కేపీ శ్రీకాంత్ స్పందించాడు.
"ముఖ్యమైన ప్రకటన.. యూఐ: ది మూవీ ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ దక్కించుకుందని సోషల్ మీడియాతోపాటు కొన్ని ఇతర ప్లాట్‌ఫామ్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇది తప్పుడు వార్త. ఓటీటీ హక్కులతోపాటు ఇతర అప్డేట్ల గురించి అధికారిక సమాచారాన్ని యూఐ టీమ్ మాత్రమే ఇస్తుంది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దు, వాప్తి చేయొద్దు. సరైన అప్డేట్స్ కోసం మూవీ అధికారిక ఛానెల్స్ చూస్తూ ఉండండి" అని టీమ్ స్పష్టం చేసింది.
ప్రైమ్ వీడియోలోకి యూఐ?
ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్టులో జీ కన్నడ, జీ స్టూడియోస్ లోగోలు ఉండటంతో టీవీ హక్కులు మాత్రం జీ నెట్‌వర్క్ కు దక్కినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రైమ్ వీడియో చేతికి వచ్చినట్లు సమాచారం.
ఈ మధ్య కాలంలో టాప్ కన్నడ సినిమాల హక్కులను ఆ ఓటీటీ దక్కించుకుంటోంది. దీంతో యూఐ విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.