Kabzaa OTT Release Date: ఉపేంద్ర కబ్జా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే
Kabzaa OTT Release Date: ఉపేంద్ర కబ్జా సినిమా థియేటర్‌లో రిలీజైన ఇరవై ఐదు రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఏదంటే...
Kabzaa OTT Release Date: ఉపేంద్ర హీరోగా నటించిన నటించిన పాన్ ఇండియన్ మూవీ కబ్జా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దాదాపు 110 కోట్ల వ్యయంతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు కన్నడ స్టార్ హీరోలు సుదీప్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్ని పోషించారు.
ట్రెండింగ్ వార్తలు
కన్నడ బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్‌కు పోటీగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్స్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. కేజీఎఫ్ ను పోలి కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు సాగడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
రొటీన్ గ్యాంగ్‌స్టర్ పాయింట్ కావడంతోనే మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో థియేటర్ల రిలీజైన ఇరవై ఐదు రోజుల గ్యాప్‌లోనే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
కన్నడంతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కబ్జా సినిమాలో శ్రియా హీరోయిన్‌గా నటించింది.
110 కోట్ల బడ్జెట్ - 32 కోట్ల కలెక్షన్స్
మార్చి 17న రిలీజైన కబ్జా సినిమా అన్ని భాషల్లో కలిపి తొమ్మిది రోజుల్లో కేవలం 32 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. 110 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. కన్నడ మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే థియేటర్ల నుంచి ఎత్తేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.