Kabzaa First Day Collections: కబ్జ ఫస్ట్ డే కలెక్షన్స్ - 35 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే 13 కోట్లు వచ్చింది
Kabzaa First Day Collections: ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జ సినిమా భారీ అంచనాలు నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే...
Kabzaa First Day Collections: ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో కన్నడ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో శుక్రవారం రిలీజైంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్‌కు పోటీగా రిలీజైన ఈ సినిమాలో సుదీప్, శివరాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో నటించారు.
ట్రెండింగ్ వార్తలు
తొలిరోజు ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కబ్జ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, స్టోరీలైన్‌తో పాటు విజువల్స్ కేజీఎఫ్‌ను పోలి ఉండటంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. కాగా ముగ్గురు కన్నడ అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తొలిరోజు అన్ని భాషల్లో కలిపి దాదాపు 13 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
మొదటి రోజు కన్నడ వెర్షన్ తొమ్మిది కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌కు శుక్రవారం రోజు కోటిన్నర కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. హిందీలో కోటిన్నర, తమిళంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో కోటి వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది.
ఓవరాల్‌గా ఫస్ట్‌డే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 13 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కబ్జ సినిమాలో ఆర్కేశ్వర అనే ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా ఉపేంద్ర నటించాడు. కొన్ని పరిస్థితుల వల్ల అతడు క్రైమ్ వరల్డ్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు చంద్రు ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించింది.