Unstoppable2 with NBK Teaser: దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ అదిరింది
Unstoppable2 with NBK Teaser: దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ అన్‌స్టాపబుల్2 విత్ ఎన్‌బీకే టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్‌ను మంగళవారం (అక్టోబర్ 4) రాత్రి మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 1 పెద్ద సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య ఓ డిఫెరెంట్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో తలపై హ్యాట్, బ్రౌన్ కోట్, దానికి తగిన ప్యాంట్ వేసుకొని, చేతిలో కొరఢా పట్టుకున్న బాలకృష్ణ ఫ్యాన్స్‌ను శివాలెత్తించేలా ఉన్నాడు.
ఈ సెలబ్రిటీ టాక్ షో టీజర్ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ బాలయ్య బాబును ఈ టీజర్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక చివర్లో దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ ఇచ్చి పంచ్‌లైన్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ టీజర్‌ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఇందులో బాలకృష్ణ లుక్ వైరల్‌గా మారింది.
గుహలో దివిటీ పట్టుకొని ఏదో వెతుకుతున్నట్లుగా అతడు కనిపిస్తాడు. విజయవాడలో అన్‌స్టాపబుల్ 2 గ్రాండ్ లాంచ్ జరగనుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ 2 ఆంథెమ్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 1 సూపర్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ను మరింత గ్రాండ్‌గా తీసుకురావాలని ఆహా ఓటీటీ ప్లాన్ చేస్తోంది.
అందులో భాగంగానే ఆంథెమ్, టీజర్‌లతోనే సీజన్ 2పై అంచనాలు పెంచేసింది. ఈసారి షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, తన అల్లుడు నారా లోకేశ్‌లతో మాట్లాడనున్నాడన్న వార్త ఇప్పటికే సంచలనం రేపిన విషయం తెలిసిందే. వీళ్లే కాదు.. ఎంతోమంది టాలీవుడ్, రాజకీయ ప్రముఖులను ఈ అన్‌స్టాపబుల్ 2లో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నాడు.