Telugu News  /  Entertainment  /  Unstoppable With Nbk Season 2 Will Launch Very Soon And Anthem Also Ready
అన్‌‍స్టాపబుల్ యాంథెమ్
అన్‌‍స్టాపబుల్ యాంథెమ్

Unstoppable with NBK 2: అన్‌స్టాపబుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. త్వరలో యాంథెమ్ విడుదల

23 September 2022, 20:48 ISTMaragani Govardhan
23 September 2022, 20:48 IST

Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్‌ 2కి రంగం సిద్ధమైంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. త్వరలో అన్‌స్టాపబుల్ యాంథెమ్‌ను విడుదల చేయనున్నారు.

Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ.. సినిమాలతోనే కాదు.. యాంకర్‌గానూ తనదైన మార్కును చూపించారు. గతేడాది అన్‍‌స్టాపబుల్ అంటూ ఆహా ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య తనదైన కామెడీకి తోడు.. గెస్టులను నవ్విస్తూ సరదాగా హోస్ట్ చేశారు. ఆయన ఎనర్జీకి, మాటతీరుకు ప్రశంసల వర్షం కురిసింది. ముఖ్యంగా యువత బాగా ఆకర్షితులయ్యారు. నెటిజన్లు కూడా విశేషంగా స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య క్రేజ్ గట్టిగానే పెరిగింది. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్లుగానే ఇటీనలే ఆహా ఓటీటీ ఇటీవలే ఈ సీజన్ గురించి అప్డేట్ ఇచ్చింది. తాజాగా మరో అప్డేట్‌తో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో కాదు.. అన్‌స్టాపబుల్ 2 కోసం స్పెషల్‌గా యాంథమ్‌ను విడుదల చేయనుంది. ఈ స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ఆహా.. సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ సాంగ్ వేరే లెవల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం.

“ఏదైనా ఈ సాంగ్ రిలీజ్ అయ్యే వరకే.. ఒక్కసారి బాలయ్య స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఇక్కడ ప్లే చేస్తే రీసౌండ్ ఎక్కడో వస్తది.. గ్యారంటీ!! బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ ఇక్కడ.. అన్‌స్టాపబుల్ యాంథమ్.. త్వరలో రాబోతుంది” అంటూ ఆహా ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. విజయ దశమి కానుకగా.. ఈ సీజన్ 2 లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

గత సీజన్‌లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

టాపిక్