unstoppable pawan kalyan: త్రివిక్రమ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాల్సివచ్చిందన్న పవన్ - అన్‌స్టాపబుల్ ప్రోమో రిలీజ్
Unstoppable Pawan Kalyan: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కు సంబంధించి లేటెస్ట్ ప్రోమోను శుక్రవారం రిలీజ్ చేశారు. త్రివిక్రమ్‌తో ఫ్రెండ్‌షిప్‌తో పాటు తన మూడు పెళ్లిళ్ల గురించి పవన్ క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రోమోలో చూపించడం ఆసక్తిని పంచుతోంది.
Unstoppable Pawan Kalyan: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్. శుక్రవారం ప్రోమోను రిలీజ్ చేసింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సీన్‌తో ప్రోమో ప్రారంభమైంది. షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఈశ్వరా...పవనేశ్వరా అంటూ బాలకృష్ణ అనడం ఆకట్టుకుంటోంది. నేను మీకు తెలుసు...నా స్థానం మీ మనసు అంటూ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ థీమ్ డైలాగ్‌ను పవన్ కళ్యాణ్ చెప్పి అలరించారు. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావు...పాతికేళ్లు తగ్గావు తెలుసా ప్యాంట్ వేస్తే అంటూ పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ అనడం ప్రోమోకు హైలెట్‌గా నిలిచింది.
త్రివిక్రమ్‌తో పవన్ స్నేహాన్ని ఉద్దేశిస్తూ మీరుద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ఫ్రెండ్స్ అవ్వాల్సివచ్చిందని పవన్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది. రామ్‌చరణ్ ఎలా క్లోజ్ అని అడగ్గా చిన్నప్పుడు అతడి డ్యూటీ ఉండేదని అలా క్లోజ్ అవ్వాల్సివచ్చిందని పవన్ చెప్పాడు.
ఆ తర్వాత రామ్‌చరణ్‌తో బాలకృష్ణ ఫోన్ మాట్లాడాడు. ప్రభాస్ గురించి మ్యాటర్ చెప్పమంటే నీ గుడ్ న్యూస్ మింగేసి అతడి గుడ్ న్యూస్ వినిపించావు అని రామ్‌చరణ్ తో బాలకృష్ణ అనడం నవ్వులను పంచుతోంది.
ఆ తర్వాత ఎపిసోడ్‌లోకి పవన్ కళ్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హాజరైనట్లుగా ప్రోమోలో చూపించారు. హారర్ సినిమాకు అమ్మాయిలకు తేడా లేదని చెప్పి సాయిధరమ్‌తేజ్ నవ్వించారు. సరదాగా సాగిన షో లో పవన్ పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ ప్రశ్న అడగటంతో సీరియస్‌గా మారింది. వాటి గురించి పవన్ చెప్పిన సమాధానాన్ని కొంత మాత్రమే చూపించారు.
ఆ తర్వాత పవన్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలకృష్ణ అడిగిన మరో ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పినట్లుగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ ప్రోమో చివరలో చూపించారు.