Unstoppable with NBK: ఏంట్రా నీ బలుపు.. టాలీవుడ్ డైరెక్టర్‌పైకి దూసుకెళ్లిన బాలీవుడ్ విలన్.. వీడియో వైరల్
Unstoppable with NBK: ఏంట్రా నీ బలుపు అంటూ టాలీవుడ్ డైరెక్టర్‌పైకి దూసుకెళ్లాడు బాలీవుడ్ విలన్. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
Unstoppable with NBK: ఏంట్రా నీ బలుపు అంటూ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపైకి దూసుకెళ్లాడు బాలీవుడ్ విలన్ అర్జున్ రాంపాల్. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తినలేదు. చాలా గట్టిగా నవ్వేశారు. ఎందుకంటే ఇది జరిగింది బాలయ్య బాబు ఆహా (Aha) ఓటీటీలో చేసే టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో కాబట్టి.
ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసింది. దీనికి తాజాగా భగవంత్ కేసరి టీమ్ వచ్చింది. ఈ మూవీ హీరో, హోస్ట్ అయిన బాలకృష్ణతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల వచ్చారు. చివర్లో ఈ మూవీలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.
దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఇందులో ఒకచోట ఏంట్రా నీ బలుపు అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడిపైకి దూసుకెళ్లాడు అర్జున్ రాంపాల్. అది చూసి పక్కనే ఉన్న బాలయ్య, శ్రీలీల పడీపడీ నవ్వారు. అర్జున్ ఎంటరయ్యే ముందు శ్రీలీలను టీజ్ చేస్తుంటాడు అనిల్. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే.. అర్జున్ అతనికి ఇలా మాస్ వార్నింగ్ ఇచ్చే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
ఇక అర్జున్ రాంపాల్ ను చూడగానే ముంబై సే ఆయా మేరా దోస్త్.. అంటూ బాలయ్య బాబు పాటందుకున్నాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంతా బాగానే ఉంది కానీ.. నాకు నా మ్యాన్షన్ హౌజ్ ఇవ్వలేదంటూ బాలయ్యను అడుగుతాడు అర్జున్. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లేటెస్ట్ ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
భగవంత్ కేసరి ఎలా ఉందంటే..
భగవంత్ కేసరి పక్కా బాలకృష్ణ మార్క్ మూవీ. ఆయన శైలి మాస్, యాక్షన్ సన్నివేశాలకు రివేంజ్ డ్రామాను జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథను రాసుకున్నాడు. బాలకృష్ణ, శ్రీలీల ఎమోషన్స్ ప్రధానంగా సినిమా సాగుతుంది. బాలకృష్ణకు ఇలాంటి సినిమాలు కొత్త కాదు.
డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి మాత్రం తన పంథాకు భిన్నంగా ఫస్ట్‌టైమ్ మాస్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా చేశాడు. కథ లాజిక్‌లను పక్కనపెట్టి బాలకృష్ణలోని హీరోయిజం ద్వారా పాస్ మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు అనిల్ రావిపూడి. తెలంగాణ స్లాంగ్, డైలాగ్స్ సినిమా అడ్వాంటేజ్‌గా నిలిచాయి.
భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ చెలరేగిపోయాడు. తెలంగాణ యాసలో అతడు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. లుక్, గెటప్ వైవిధ్యంగా ఉన్నాయి. విజ్జీ పాప పాత్రలో శ్రీలీల ఆకట్టుకుంటుంది. అల్లరి అమ్మాయిగా ఆమె నటన మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫన్నీగా, సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా శ్రీలీల క్యారెక్టర్ సాగుతుంది. కాజల్ పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదు. స్టైలిష్ విలన్‌గా అర్జున్ రాంపాల్, శ్రీలీల తండ్రిగా శరత్‌కుమార్ ఒకే అనిపించారు. కథకుడిగా కంటే డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ఈ సినిమాతో ఎక్కువగా మార్కులు పడతాయి.
టాపిక్