Unstoppable 3 on Aha: అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. బాలయ్య మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి ‘లిమిటెడ్'-unstoppable with nbk limited edition teaser released by aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable With Nbk Limited Edition Teaser Released By Aha

Unstoppable 3 on Aha: అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. బాలయ్య మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి ‘లిమిటెడ్'

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 07, 2023 04:55 PM IST

Unstoppable 3 on Aha OTT: అన్‍స్టాపబుల్‍ తదుపరి సీజన్‍పై ఆహా అధికారికంగా ప్రకటన చేసింది. బాలకృష్ణ మరోసారి ఈ టాక్‍షోలో సందడి చేయనున్నారు.

Unstoppable 3 on Aha: అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. బాలయ్య మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి ‘లిమిటెడ్'
Unstoppable 3 on Aha: అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. బాలయ్య మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి ‘లిమిటెడ్'

Unstoppable 3 on Aha OTT: నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో సూపర్ హిట్ అయింది. తొలినాళ్లలో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. టాలీవుడ్ టాప్ స్టార్లు అన్‍స్టాపబుల్‍కు వచ్చారు. బాలకృష్ణ వారితో మాట్లాడడం, చాలా విషయాలను బయటికి లాగడం, ఆటలు ఆడించడం, ఆట పట్టించడం ఇలా చాలా ఇంట్రెస్టింగ్‍గా అన్‍స్టాపబుల్ రెండు సీజన్లు సాగాయి. మళ్లీ మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూశారు. అయితే, ఆ సమయం సమీపిస్తోంది. అన్‍స్టాపబుల్ తదుపరి సీజన్ గురించి ఆహా నేడు (అక్టోబర్ 7) అధికారిక ప్రకటన చేసింది.

ట్రెండింగ్ వార్తలు

అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే లిమిటెడ్ ఎడిషన్ టీజర్‌ను ఆహా ఓటీటీ నేడు రిలీజ్ చేసింది. త్వరలో ఈ టాక్‍ షో మరో సీజన్ రానుందంటూ పేర్కొంది. “అవును.. మీ ఊహించింది నిజమే. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ వచ్చేస్తోంది. అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే, లిమిటెడ్ ఎడిషన్ త్వరలో వచ్చేస్తోంది” అని ఆహా ట్వీట్ చేసింది. అయితే, లిమిటెడ్ ఎడిషన్ అని పేర్కొనడటంతో ఈ సీజన్‍లో ఎక్కువ ఎపిసోడ్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కొన్ని ఎపిసోడ్లకే పరిమితం కావొచ్చు.

“గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‍స్టాపబుల్” అనే బాలయ్య డైలాగ్‍తో అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్ మొదలైంది. “దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. ఈ పేరు సానా ఏండ్లు దాటుంటది.. కలుద్దాం ఆహాలో” అనే బాలయ్య డైలాగ్స్ ఉన్నాయి.

కాగా, అన్‍స్టాపబుల్ ఈ నయా సీజన్ ఈనెలలోనే దసరా సందర్భంగా మొదలవుతుందనే టాక్ ఉంది. ఈ సీజన్‍లో మెగాస్టార్ చిరంజీవి కూడా బాలయ్య అన్‍స్టాపబుల్‍కు వస్తారనే అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రవితేజ, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు సహా మరికొందరు టాలీవుడ్ స్టార్లు అన్‍స్టాపబుల్ తొలి రెండు సీజన్లకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అన్‍స్టాపబుల్‍లో పాల్గొన్నారు. రెండు సీజన్లలో బాలకృష్ణ హోస్ట్‌గా అదరగొట్టారు. తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఆకట్టుకున్నారు. దీంతో తదుపరి సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.