Unstoppable 4 OTT: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!-unstoppable with nbk 4 ott nandamuri balakrishna talk show new season streaming may start from dussehra on aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable 4 Ott: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!

Unstoppable 4 OTT: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2024 02:14 PM IST

Unstoppable Season 4 OTT: అన్‍స్టాపబుల్ 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేసే ఈ షో మళ్లీ ఎప్పుడా అని నిరీక్షిస్తున్నారు. అయితే, ఈ కొత్త సీజన్ ఎప్పుడు మొదలుకానుందో సమాచారం బయటికి వచ్చింది.

Unstoppable 4 OTT: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!
Unstoppable 4 OTT: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!

గాడ్ ఆఫ్ మాసెస్, సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ టాక్ షో చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో వచ్చిన తొలి రెండు సీజన్లు అద్భుతమైన సక్సెస్ అయ్యాయి. టాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ షో భారీ వ్యూస్ దక్కించుకుంది. మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్‍గానే వచ్చింది. అయితే, త్వరలో పూర్తిస్థాయిలో అన్‍స్టాపబుల్ సీజన్ 4 వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సీజన్ ఎప్పుడు మొదలుకానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

దసరా పండుగకు..

అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్‍ను దసరా సందర్భంగా ప్రారంభించాలని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‍ను అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పటికే ప్లాన్ చేస్తోందని సమాచారం.

షూటింగ్ ఎప్పుడు!

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లితో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ తొలివారంలోగా పూర్తి అవుతుందని అంచనాలు ఉన్నాయి. అన్‍స్టాపబుల్ 4వ సీజన్ కోసం సెప్టెంబర్ మూడో వారం నుంచి బాలకృష్ణ షూటింగ్‍లో పాల్గొంటారని సమాచారం. ఇలా అయితే, దసరాకు తొలి ఎపిసోడ్ తీసుకురావొచ్చని ఆహా ఆలోచిస్తోంది.

అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే నాలుగో సీజన్ గురించి త్వరలోనే ఆహా అధికారిక ప్రకటన చేయనుంది. త్వరలోనే అంటూ అప్‍డేట్‍ను సిద్దం చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం సాగితే.. దసరా పండుకకు అన్‍స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ వస్తుంది.

అన్‍స్టాపబుల్‍ తొలి రెండు సీజన్లలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి సహా మరికొందరు సెలెబ్రిటీలు వచ్చారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఓ ఎపిసోడ్‍కు వచ్చారు. మరికొందరు దర్శకులు, టెక్నిషియన్స్ కూడా పాల్గొన్నారు. లిమిటెడ్ ఎడిషన్‍గా మూడో సీజన్ రెండు ఎపిసోడ్లే సాగింది. అందులో ఓ ఎపిసోడ్‍కు యానిమల్ మూవీ ప్రమోషన్ల కోసం బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వచ్చారు.

అన్‍స్టాపబుల్‍ టాక్‍ షోను బాలకృష్ణ చాలా సక్సెస్‍ఫుల్‍గా, ఎంటర్‌టైనింగ్‍గా నడిపారు. తన మార్క్ మాటలు, చలాకీతనం, పంచ్‍లతో మెప్పించారు. ఎపిసోడ్లకు వచ్చే గెస్టులను చాలా కొత్త విషయాలు రాబట్టారు.. కొన్నిసార్లు సరదాగా ఆట పట్టించారు. ఈ షోను బాలయ్య హోస్ట్ చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. తొలినాళ్లలో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍కు అన్‍స్టాపబుల్ చాలా క్రేజ్ తీసుకొచ్చింది. నాలుగో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో నిరీక్షిస్తున్నారు.

ఎన్‍బీకే109 గురించి..

బాలకృష్ణ ప్రస్తుతం ఎన్‍బీకే109 (ప్రాజెక్ట్ పేరు) చేస్తున్నారు. ఈ సినిమాను మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు గ్లింప్స్ వీడియోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుంచి త్వరలోనే టీజర్ రానుందని, దీంట్లో టైటిల్‍ను మేకర్స్ రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లేకపోతే డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.