Pawan Kalyan in Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షో వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయా నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టిస్తున్నారు. ఇటీవలే బాహుబలి ప్రభాస్‌తో కూడా ఆయన ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కోసం అభిమానలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.,ఇప్పటికే పవర్ స్టార్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదల కాగా.. బాలయ్య ఆసక్తికర ప్రశ్నలను సంధించారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా తనదైన సమాధానాలను ఇచ్చారు. తన అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి? వద్దనుకున్నవి ఏంటి? అంటూ పవన్‌ను బాలయ్య ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అని, కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలో ఎందుకు కన్వర్ట్ కాలేదని సూటిగా అడిగారు. దీంతో ప్రోమో ఆసక్తికరంగా సాగింది.,తాజాగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్‌కు సంబంధించి నెట్టింట ఓ వార్త షికారు చేస్తోంది. పవర్ స్టార్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 3న ప్రసారం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులే కాకుండా పవర్‌స్టార్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా చూస్తున్నారు.,పవర్ స్టార్ ఎపిసోడ్‌ను అన్‌స్టాపబుల్ టీమ్ రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్యతో పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణలు ఎక్కువ సేపు ఉన్నాయని, కాబట్టి రెండు భాగాలుగా ప్రసారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్‌ను కూడా రెండు భాగాలుగా విడుదల చేశారు.,