PSPK With NBK : బాలయ్యతో పవన్.. పార్ట్ 1, 2 వచ్చేది ఈ తేదీల్లోనే!
Unstoppable 2 With NBK : అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ త్వరలో ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.
Pawan Kalyan in Unstoppable : నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షో(Unstoppable) వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయా నేతలను కూడా అన్‌స్టాపబుల్ షోకు తీసుకొచ్చి రక్తి కట్టిస్తున్నారు. ఇటీవలే బాహుబలి ప్రభాస్(Prabhas)తో కూడా ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఎపిసోడ్ కోసం అభిమానలు ఎదురుచూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అన్‌స్టాపబుల్ పవర్ స్టార్ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదలైంది. బాలయ్య ఆసక్తికర ప్రశ్నలను వేయగా.. పవన్ కల్యాణ్ తనదైన సమాధానాలను ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి? వద్దనుకున్నవి ఏంటి? అంటూ పవన్‌ను బాలయ్య(Balayya) ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అని, కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలో ఎందుకు కన్వర్ట్ కాలేదని సూటిగా అడిగారు బాలయ్య. ఇలాంటి ప్రశ్నలతో షో మీద మరింత ఆసక్తి పెరిగింది.
అయితే బాలయ్య, పవన్ కల్యాణ్ షో విడుదల తేదీ ఖరారైనట్టుగా తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2(Unstoppable 2 With NBK) లేటెస్ట్ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది. రెండు ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన పార్ట్ 1, ఫిబ్రవరి 10వ తేదీన పార్ట్ 2 విడుదల కానుందని తెలుస్తోంది. అయితే పవన్ ఎపిసోడ్ తర్వాత.. అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఎండ్ పడనుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది.
పవన్ కల్యాణ్-బాలయ్య రాజకీయాల్లో కొనసాగుతుండటంతో ఈ ఎపిసోడ్స్ పై ఆసక్తి నెలకొంది. ఇద్దరూ వైసీపీకి ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మూడు పెళ్లిళ్ల విమర్శలకు పవన్ కల్యాణ్ ఇందులో కూడా సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం