Marco Telugu: వయలెన్స్.. వయలెన్స్.. మలయాళంలో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తున్న మార్కో తెలుగు ట్రైలర్ రిలీజ్!
Marco Movie Telugu Trailer Released: మలయాళ పాపులర్ నటుడు ఉన్ని మకుందన్ నటించిన లెటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ మార్కో. మోస్ట్ వయలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో మలయాళంలో కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది. అలాంటి మార్కో తెలుగు ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
Marco Movie Telugu Trailer Released: తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ట్యాలెంటెడ్ మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్ తన లేటెస్ట్ చిత్రం 'మార్కో'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్కో సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు.
విమర్శకుల ప్రశంసలు
హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కో చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. మార్కో మూవీ డిసెంబర్ 20న మలయాళ థియేటర్‌లలోకి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం. విడుదలైన తర్వాత ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలను అందుకుని ఘన విజయం సాధించింది మార్కో మూవీ.
80 కోట్ల కలెక్షన్స్
ముఖ్యంగా ఉన్ని ముకుందన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. చిత్రం గ్రిప్పింగ్ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పవర్ ఫుల్ మ్యూజిక్, మొత్తం టెక్నికల్‌కు ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తోంది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మార్కో వారం రోజుల్లోనే కేరళలో రూ. 80 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
జనవరి 1న తెలుగులో రిలీజ్
మలయాళంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ అందుకున్న మార్కో మూవీని జనవరి 1 నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంటే, జనవరి 1 నుంచి న్యూ ఇయర్ సందర్భంగా మార్కో తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మార్కో తెలుగు ట్రైలర్‌ను డిసెంబర్ 28న రిలీజ్ చేశారు మేకర్స్.
మోస్ట్ వయెలెంట్ మూవీగా
మార్కో తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ఇంటెన్స్ బ్లడ్ షెడ్ వరల్డ్‌లోకి ఒక గ్లింప్స్‌గా హీరో యాక్షన్-ప్యాక్డ్ జర్నీని హైలైట్ చేసింది. ఫుల్ లెంత్ అండ్ మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో తెలుగు ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్‌లో మార్కో రక్తపాతాన్ని చూడొచ్చు. అయితే, ఈ సినిమా ఒక రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తోంది.
రివేంజ్ స్టోరీ
తన సోదరుడు, అతని ఫ్రెండ్‌ను చంపిన వాళ్లపై రివేంజ్ తీసుకుంటాడు మార్కో. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి ఏం జరిగింది, మార్కో ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలాంటి రక్తపాతం సృష్టించాడు అనేదే మార్కో కథ. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా సినిమా హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఆకట్టుకున్నాడు. అతని పాత్ర సినిమాకు మెయిన్ స్ట్రెంత్‌లో ఒకటి.
మార్కో నటీనటులు
ఉన్ని ముకుందని ఇదివరకు జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి ఇతర తెలుగు సినిమాల్లో నటించాడు. కాగా మార్కో మూవీలో అతనితోపాటు సిద్దిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా ఇతర కీలక పాత్రలు పోషించారు.
మార్కో బీజీఎమ్
చంద్రు సెల్వరాజ్ స్టైలిష్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ ఇంటెన్స్ స్కోర్‌తో యాక్షన్‌ని మరింత ఎలివేట్ చేశాడు. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ నెరేటివ్ వేగంగా సాగేలా చేసింది. ట్రైలర్ తెలుగు ప్రేక్షకులలో సంచలనాన్ని సృష్టించింది. సినిమా గ్రిప్పింగ్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుని హైలీ యాంటిసిపేటెడ్ రిలీజ్‌గా ఆడియన్స్ ముందుకు వస్తోంది.