Marco Review: మార్కో రివ్యూ - యాక్షన్ లవర్స్‌కు ఫుల్ మీల్స్ - మోస్ట్ వయలెంట్ మూవీ ఎలా ఉందంటే?
Marco Review: భాగమతి, యశోద సినిమాల ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీ న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం తెలుగులో రిలీజైంది. మలయాళంతో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Marco Review: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళం మూవీ మార్కో తెలుగు వెర్షన్ బుధవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
మార్కో రివేంజ్
కొచ్చిన్‌లోని గోల్డ్ సిండికేట్‌కు జార్జ్ (సిద్ధిఖీ) లీడర్‌గా వ్యవహరిస్తోంటాడు. జార్జ్ తమ్ముడు విక్టర్ (ఇషాన్)పుట్టుకతోనే అంధుడు. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను గోల్డ్ సిండికేట్ మెంబర్ టోనీ ఇసాక్ (జగదీష్) కొడుకు రసెల్ ఇసాక్ (అభిమన్యు తిలకన్) చంపేస్తాడు. కళ్లు లేకపోయినా రసెల్‌ను విక్టర్ గుర్తుపడతాడు. విక్టర్ ప్రాణాలతో ఉంటే తనకు ప్రమాదమని భావించిన రసెల్ అతడిని యాసిడ్‌లో ముంచేసి దారుణంగా చంపేస్తాడు.
విక్టర్‌ను చంపిన వాళ్లను మార్కో ఎలా కనిపెట్టాడు? వారిని ఏం విధంగా చంపేశాడు? మార్కో రివేంజ్ కారణంగా జార్జ్ ఫ్యామిలీకి ఎలాంటి నష్టం జరిగింది? జార్జ్ ఫ్యామిలీతో మార్కోకు ఉన్న సంబంధమేమిటి? మార్కో లైఫ్‌లోకి వచ్చిన మారియా ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
రెండు గంటలు స్క్రీన్‌పై భీభత్సం...
మార్కో సాదాసీదా రివేంజ్ డ్రామా మూవీ. తన సోదరుడి మరణంపై ప్రతీకారం తీర్చుకునే ఓ యువకుడి కథతో దర్శకుడు హనీఫ్ అదేని మార్కో మూవీని తెరకెక్కించాడు. చెప్పుకుంటే రెండు నిమిషాల్లోనే ముగిసిపోయే కథతో రెండు గంటలు సిల్వర్ స్క్రీన్‌పై భీభత్సమే సృష్టించాడు. సినిమాలోని ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుంది. రక్తం ఏరులై పారుతుంది. యాక్షన్ లవర్స్ సైతం ఈ రేంజ్ రక్తపాతాన్ని భరించలేమని అనుకునేలా చేశాడు డైరెక్టర్.
ఎటాక్ సీన్...
క్లైమాక్స్‌లో విలన్ గుండెను చీల్చి హీరో చంపేసే సీన్.. గన్‌తో విలన్ గ్యాంగ్ మెంబర్స్‌ను పీస్‌లు చేయడం, చైన్‌సా మిషన్‌తో కోసుకుంటే వెళ్లిపోవడం...ఇలాంటి సన్నివేశాలు సినిమా నిండా కనిపిస్తాయి. హీరో ఫ్యామిలీపై విలన్ గ్యాంగ్ ఎటాక్ చేసే సీన్‌ను చూస్తూ థియేటర్‌లో కూర్చోవడం చూడటం కష్టమే. హింసకు పరాకాష్టలా ట్రాక్ సాగుతుంది.
తన డైరెక్షన్ టాలెంట్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌లోనే చూపించాడు హనీఫ్ అదేని. సినిమా నిండా యాక్షన్ తప్ప ఏం కనిపించదు. ఈ రేంజ్ వయలెన్స్‌తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు సినిమా రాలేదు. వయలెన్స్ పరంగా సినిమాల్లో ఉన్న హద్దులన్నింటిని బద్దలు కొట్టేశాడు.
యానిమల్ నుంచి
మార్కో మూవీలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు గతంలో వచ్చిన పలు సూపర్ హిట్ సినిమాల రిఫరెన్స్‌లు చాలానే కనిపిస్తాయి. ఉన్ని ముకుందన్ క్యారెక్టరైజేషన్ చాలా వరకు యానిమల్‌లో రణభీర్‌కపూర్‌ను పోలి ఉంటుంది. హీరో ఆటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ రణభీర్‌ను గుర్తుకుతెస్తాయి. మార్కో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ పుష్ప 2లోని క్లైమాక్స్ సీన్ ను తలపిస్తుంది.
కేజీఎఫ్, హాలీవుడ్ మూవీ జాన్‌విక్‌తో పాటు చాలా సినిమాలు నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ కథను రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలో లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉన్నా యాక్షన్ సీన్స్ కారణంగా అవి అంతగా ఎలివేట్ కాలేకపోయాయి.
వన్ మెన్ షో...
ఉన్ని ముకుందన్ వన్ మెన్ షోగా మార్కో మూవీ నిలుస్తుంది. ప్రతీకారంతో రగిలిపోయే యువకుడిగా స్టైలిష్ యాక్టింగ్, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. జార్జ్ పాత్రలో సిద్ధిఖీ, విక్టర్‌గా ఇషాన్ మెప్పించారు. జగదీష్, కబీర్ సింగ్ దుహాన్, అభిమన్యు తిలకన్ హీరోగా ధీటుగా తమ విలనిజంతో ఆకట్టుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్‌కు రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ తోడవ్వడంతో థియేటర్లలో గూస్‌బంప్స్ ఫీలింగ్ కలుగుతుంది.
ఫుల్ మీల్స్...
యాక్షన్ లవర్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఈ మూవీ ఉంటుంది. చిన్నపిల్లలు, లేడీస్ ఈ మూవీని చూడటం కష్టమే.